Home » Haryana
హర్యానాలో బీజేపీ సీనియర్ నేత, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సీఎం పేరును కూడా పార్టీ ప్రకటించింది.
హర్యానాలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అనంతరం రాజీనామా చేశారు. ఆయన బాటలోనే క్యాబినెట్ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుశ్యంత్ చౌతాలా సారధ్యంలోని జేజేపీతో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు రావడం ఈ పరిస్థితికి కారణమైంది.
పిచ్చివాడు అన్న కారణంతో ఓ తల్లిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈఘటన హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 48 విపుల్ గ్రీన్స్ అపార్ట్మెంట్లో రాను షా(59) అనే మహిళ తన భర్త, కుమారుడు అత్రిష్(27) తో కలిసి నివసిస్తోంది.
'ధర్మం' తమ పార్టీతో ఉందని, ప్రజలు ధర్మంతో ఉంటారో అధర్మం వెనుక ఉంటారో తేల్చుకోవాలని 'ఆప్' చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తాను గెలిపించాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి హర్యానాలో షాక్ తగిలింది. హిసార్ పార్లమెంటు సభ్యుడు బ్రిజేంద్ర సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదివారంనాడు రాజీనామా చేశారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఆ వెనువెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈరోజు రైల్ రోకో ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసనలు తెలుపనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
లాలీపాల్లు కంటే తేలిగ్గా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని, పోలీసులు మాత్రం మాదకద్రవ్యాల అక్రమ విక్రేతల జాడ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఓ యూనివర్శిటీ విద్యార్థి స్యయంగా పోలీసులకు క్లాస్ పీకాడు. డ్రగ్స్ బెడదను నిర్భీతగా పోలీసుల ముందే ఆ విద్యార్థి బయటపెట్టడాన్ని చూసి తోటి స్నేహితులు చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన చోటు చేసుకున్న ఇట్టే నెట్టింట్లోకి చేరిపోతోంది. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఇలా ఫొటోలు, వీడియోలు తీసి.. అలా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను గోవాలో పట్టుకున్నారు. సౌరవ్, ఆశిష్‌ను గోవాలో పట్టుకున్నామని, మరికరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
నవజాత శిశువు మరణం హరియాణాలో కలకలం సృష్టించింది. ఆ మగ శిశువు ప్రహారీ గ్రిల్స్‌పై పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్రోండా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి నవజాత శిశువును ఓ భవనం ప్రహరీ గ్రిల్స్‌పై పడేశాడు.