Share News

BJP: బీజేపీ ఎంపీ షాక్... పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక

ABN , Publish Date - Mar 10 , 2024 | 02:03 PM

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి హర్యానాలో షాక్ తగిలింది. హిసార్ పార్లమెంటు సభ్యుడు బ్రిజేంద్ర సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదివారంనాడు రాజీనామా చేశారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఆ వెనువెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

BJP: బీజేపీ ఎంపీ షాక్... పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Election) వేళ బీజేపీ (BJP)కి హర్యానా (Haryana)లో షాక్ తగిలింది. హిసార్ పార్లమెంటు సభ్యుడు బ్రిజేంద్ర సింగ్ (Brijendra Singh) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదివారంనాడు రాజీనామా చేశారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఆ వెనువెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్ తనయుడుడైన బ్రిజేంద్ర సింగ్ నేరుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.


అనంతరం మీడియాతో బ్రిజేంద్ర సింగ్ మాట్లాడుతూ, తాను బీజేపీని వీడడానికి బీజేపీ-జేజేపీ పొత్తు ఒక కారణమని చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా హిసార్ నియోజకవర్గానికి సేవలందించే అవకాశం కల్పించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన 'ఎక్స్' పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హిసార్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బ్రిజేంద్ర సింగ్ ఆ ఎన్నికల్లో జేజేపీ అభ్యర్థి దుష్యంత్ చౌతాలా, కాంగ్రెస్ అభ్యర్థి భవ్య బిష్ణోయ్‌పై గెలిచారు.

Updated Date - Mar 10 , 2024 | 02:45 PM