Share News

Viral Video: లాలీపాప్‌ల కంటే తేలిగ్గా దొరుకుతున్న మాదకద్రవ్యాలు.. పోలీసులకు క్లాస్ పీకిన విద్యార్థి

ABN , Publish Date - Mar 08 , 2024 | 08:16 PM

లాలీపాల్‌లు కంటే తేలిగ్గా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని, పోలీసులు మాత్రం మాదకద్రవ్యాల అక్రమ విక్రేతల జాడ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఓ యూనివర్శిటీ విద్యార్థి స్యయంగా పోలీసులకు క్లాస్ పీకాడు. డ్రగ్స్ బెడదను నిర్భీతగా పోలీసుల ముందే ఆ విద్యార్థి బయటపెట్టడాన్ని చూసి తోటి స్నేహితులు చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

Viral Video: లాలీపాప్‌ల కంటే తేలిగ్గా దొరుకుతున్న మాదకద్రవ్యాలు.. పోలీసులకు క్లాస్ పీకిన విద్యార్థి

న్యూఢిల్లీ: లాలీపాల్‌లు (lollipop) కంటే తేలిగ్గా మాదకద్రవ్యాలు (Drugs) దొరుకుతున్నాయని, పోలీసులు మాత్రం మాదకద్రవ్యాల అక్రమ విక్రేతల జాడ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఓ యూనివర్శిటీ విద్యార్థి స్యయంగా పోలీసులకు క్లాస్ పీకాడు. డ్రగ్స్ బెడదను నిర్భీతగా పోలీసుల ముందే ఆ విద్యార్థి బయటపెట్టడాన్ని చూసి తోటి స్నేహితులు చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఆసక్తికరమైన ఈ ఘటన హర్యానా సోనిపట్‌లోని ఐఐటీ ఢిల్లీ టెక్నోపార్క్‌లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన 'డ్రగ్-డీ-అడిక్షన్' కార్యక్రమంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


వీడియోలోని విద్యార్థి మాట్లాడుతూ, డ్రగ్ డీ-అడిక్షన్‌‌పై జరుగుతున్న పెద్ద ఈవెంట్‌ కోసం తామంతా ఇక్కడకు వచ్చామనీ, మాదకద్రవ్యాలకు కేంద్ర స్థానంగా యూనివర్శిటీ ఉందని వివరించాడు. నాలుగు యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ఇక్కడున్నారనీ, గంజా వంటి మాదకద్రవ్యాలు లాలీపాప్‌లంటే తేలిగ్గా వారికి దొరుకుతున్నాయని చెప్పాడు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సైతం డ్రగ్స్ డీలర్‌ ఆచూకీ తెలుసుకోగలుగుతున్నప్పుడు వారి (డ్రగ్స్ విక్రేతలు)అచూకీని పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? వారి వెనుక మీరేమైనా ఉన్నారా? అని నిలదీశాడు. సమీపంలోనే పోలీస్ చెక్ పోస్ట్ ఉందని, దాని ముందే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని ఒక యూనివర్శిటీ స్టూడెండ్‌గా తాను నమ్ముతున్నానని నిష్కర్షగా చెప్పాడు. సమస్యను హైలైట్ చేస్తూ ఆ విద్యార్థి మాట్లాడిన తీరును అభినందిస్తూ సాటి విద్యార్థులు చప్పట్లో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 08:16 PM