Home » Health Secrets
కేన్సర్ చికిత్స గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘బయాప్సీ’. కేన్సర్ ట్యూమర్ నుంచి ముక్క తీసి పరీక్షిస్తే, మిగతా అవయవాలకు కేన్సర్ వ్యాపించే ముప్పు ఉంటుందన్నది అపోహ మాత్రమేననీ, సమర్థమైన కేన్సర్ చికిత్సకు బయాప్సీ తోడ్పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మూత్రం రంగు, వాసనలు శరీరంలో దాగిన సమస్యలకు సంకేతాలు. కాబట్టి మూత్రం మీద ఓ కన్నేసి ఉంచి, మార్పులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి ఎంపాక్స్(మంకీ ఫీవర్) సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
తమలపాకులను(Betel Leaves) మనం రకరకాలుగా వినియోగిస్తుంటాం. పూజలు, శుభకార్యాలు, కిల్లీ వంటి సందర్భంలో విరివిరిగా ఉపయోగిస్తుంటాం. ఇది మనకు పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు. ఏ శుభకార్యమూ తమలపాకు లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకే నేటి తరంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెరిగింది. వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంటున్నారు. అయితే మరోపక్క చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యమైనది ఊబకాయం.
తరచూ బిగుతుగా ఉండే జీన్స్ ధరించడం వల్ల మగ, ఆడవారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ ధరించడం వల్ల సాధారణంగా చర్మ సమస్యలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. టైట్‌గా ఉండే జీన్స్ చర్మాన్ని గట్టిగా పట్టేస్తుంది. దీని వల్ల చెమట బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో చర్మంపై చికాకు రావడం, జననేంద్రియాల వద్ద గజ్జి, దురద, వంటి అనేక రకాల సమస్యలు తలెత్తె ప్రమాదం పొంచి ఉంది. అయితే ఆడవారిలో మాత్రం మరికొన్ని ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మగజాతి సంతతి తగ్గిపోతుందని, భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్న ఓ నివేదిక షాకింగ్‌కు గురిచేస్తోంది. మగవారి పుట్టుకకు కారణమైన వై క్రోమోజోములు అదృశ్యం అవుతున్నట్లు సైన్స్ అలర్ట్లోని ఒక నివేదిక తేల్చి చెప్పింది. దీంతో మగజాతి మనుగడ ప్రమాదం అంచుకు చేరుతోందని అర్థమవుతోంది. తాజాగా చేసిన అధ్యయనం ఆందోళనకు గురి చేస్తోంది.
కార్బ్స్‌ను పూర్తిగా దూరం పెట్టేసే డైట్ ట్రెండ్‌ను విస్తృతంగా అనుసరించేవాళ్లున్నారు. కానీ శక్తిని సమకూర్చే పిండిపదార్థాలను పూర్తిగా మానేస్తే శరీరానికి శక్తి సమకూరేదెలా? మంచి, చెడు పిండిపదార్థాల్లో వేటిని ఏ పరిమాణంలో తీసుకోవాలో అవగాహన ఏర్పరుచుకుని తదనుగుణంగా మసలుకోవాలి.
పిల్లలు తినడానికి మొండికేస్తారు. అయిష్టత ప్రదర్శిస్తారు. బలవంతం చేస్తే ఏడ్చేస్తారు. అలాగని వదిలేస్తే పిల్లలకు పోషకాలు అందేదెలా? ఇలాంటప్పుడు పిల్లలకు బలవర్ధక ఆహారం మీద ఇష్టం పెరిగే చిట్కాలు పాటించాలి!
వేళకు తినకపోవడం, తిన్నా అరగకపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. వేపుళ్లు, జంక్ ఫుడ్, అధిక నూనెతో వండిన వంటకాలను తినటం వల్ల గ్యాస్ పెరిగి కడుపుబ్బరం సమస్య ఎర్పడుతుంది. దీనికి చిన్న చిట్కాలతో పరిష్కారం లభిస్తుంది. అవేమిటో చూద్దాం..