Using Too Much Tooth Paste Causes : ఎక్కువ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముతున్నారా.. ఇంతకు మించి వాడితే చాలా డేంజర్..
ABN , Publish Date - Feb 17 , 2025 | 07:57 PM
Tooth Paste Side Effects : ఎక్కువ టూత్‌పేస్ట్ వేసుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందులో రవ్వంత కూడా నిజం లేదు. పేస్టే అధికంగా వాడితే దంతాలు తెల్లతెల్లగా మెరిసిపోతాయని భావిస్తుంటే అది అపోహే. నోటి ఆరోగ్యం బాగుపడటం సంగతి అటుంచితే.. వయసును బట్టి ప్రతి ఒక్కరూ సరైన పరిమాణంలో టూత్‌పేస్ట్ వినియోగించాలి. లేకపోతే నోట్లో లేనిపోని సమస్యలు రావడం పక్కా.

Tooth Paste Side Effects : నోటి ఆరోగ్యం బాగుపడాలంటే ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకసారి.. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం మంచిది. ఈ పద్ధతి ప్రతి రోజూ పాటిస్తే మీ దంతాలు, చిగుళ్లు, ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. రాత్రిపూట బ్రష్ చేస్తే నోటిలో పెరిగే బ్యాక్టీరియా వృద్ధి చెందడం ఆగిపోతుంది. కానీ, ఎక్కువ టూత్‌పేస్ట్ వాడి ప్రతిరోజూ పొద్దున, రాత్రి బ్రష్ చేస్తుంటే మాత్రం ఫలితం సున్నానే. ఇలా చేస్తే దంతాలు మరింత శుభ్రం అవుతాయని అనుకుంటే అది చాలా పొరపాటు. అధిక టూత్‌పేస్ట్ వేసుకుని పళ్లు తోమడం వల్ల ప్రయోజనాలు కలగకపోగా.. తెలియకుండానే మీ నోటిని రోగాలకు నిలయంగా మార్చినట్టవుతుంది. మరి, టూత్‌పేస్ట్ ఎంత పరిమాణంలో వాడాలో తెలుసుకోవాలనుందా..
టూత్‌పేస్ట్‌ను ఎంత వాడితే సురక్షితం?
డెంటిస్ట్‌ల ప్రకారం, బ్రష్‌కు బఠానీ పరిమాణంలో టూత్‌పేస్ట్‌ను పూస్తే సరిపోతుంది. దంతాలను బాగా శుభ్రం చేయడానికి ఈ మొత్తం సరిపోతుంది. పిల్లలు పళ్ళు తోముకునేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వారికి తక్కువ పరిమాణంలో మాత్రమే టూత్‌పేస్ట్ ఇవ్వాలి. ఎక్కువ టూత్‌పేస్ట్ వాడకం పిల్లల సున్నితమైన దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మరింత పాడుచేసి సమస్యలు తెచ్చిపడుతుంది.
టూత్‌పేస్ట్‌ను ఎందుకు ఎక్కువ వాడవద్దు?
దంతాలను బలోపేతం చేయడానికి టూత్‌పేస్ట్‌లో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. దీన్ని అధికంగా వాడితే నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. తద్వారా దంతాలపై క్యావిటీస్ ఏర్పడతాయి. పిల్లల్లో అయితే ఫ్లోరోసిస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. దంతాల శుభ్రతకు తక్కువ మొత్తంలో టూత్‌పేస్ట్‌ను ఉపయోగించమని వైద్యులు సిఫార్సు చేయడానికి ఇదే కారణం.
మౌత్ వాష్ ఎప్పుడు ఉపయోగించాలి?
మీకు నోటి ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ముందుగా దంతవైద్యుడిని సంప్రదించండి. మీ నోటి ఆరోగ్యం సాధారణంగా ఉంటే బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ ఉపయోగించవచ్చు. ఇది నోటికి తాజాదనాన్ని తెస్తుంది. దుర్వాసనను కూడా తొలగిస్తుంది. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే, మీకు ఏ రకమైన మౌత్ వాష్ ఉత్తమమో తెలుసుకోవాలంటే దంతవైద్యుడి సలహా తప్పక స్వీకరించాలి.
ఇవి కూడా చదవండి..
Mouth Wash Solution : ఇంట్లోనే మౌత్ వాష్ తయారు చేయడం వచ్చా.. చాలా సింపుల్..
Health Tips : ఈ 5 రకాల పదార్థాలు.. అన్నంతో కలిపి తింటే డయాబెటిస్..
Health Tips : ఈ సమస్యలు ఉన్నవారికి పాలకూర ప్రాణాంతకం..
మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..