Health Tips : ఈ 5 ఆహార పదార్థాలు ఇంట్లోకి తెచ్చుకుంటే.. ఎన్నో అనర్థాలు..
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:47 PM
Never Bring These 5 Foods to Home : ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర ఎంత అవసరమో ఆహారం అంతే అవసరం. ఈ 5 ఆహార పదార్థాలను పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకండి. తెలిసీ తెలియక ఎంతోమంది ఇష్టంగా తినే ఈ పదార్థాలు విషం కంటే తక్కువ కాదు. నోటికి రుచిగా ఉండే ఇవి మీ శరీరాన్ని..

Never Bring These 5 Foods to Home : మన ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపేది మన ఆహారపు అలవాట్లే. ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే అనేక వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండాలని చాలాసార్లు మనం బయట తినడం మానేస్తాము. కానీ తెలిసి లేదా తెలియకుండానే మన ఆరోగ్యానికి విషం లాంటి కొన్ని ఆహార పదార్థాలను ఇంటికి తీసుకువస్తాము. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ ఆహారాలు ఒక్కసారి తినడం మొదలుపెడితే వాటిని మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. ఈ అలవాటు వ్యసనంలా మారి అనారోగ్యాలు మోసుకొస్తుంది. తరచుగా అందరూ ఇంటికి తెచ్చుకుని నిల్వ చేసుకుని స్నాక్స్ లాగా తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంత విషపూరితమైనవో తెలిస్తే ఎవరూ తినాలని కోరుకోరు. మీ ఆరోగ్యం జాగ్రత్తంగా ఉండాలంటే..
బిస్కెట్..
తరచుగా ఎక్కువ మంది చాలా బిస్కెట్ ప్యాకెట్లు కొని ఇంట్లో నిల్వ చేసుకుంటారు. ఏదైనా తినాలనిపించిన ప్రతిసారీ వెంటనే బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తారు. నిజానికి బిస్కెట్లలో మైదా పిండి, పామాయిల్, చక్కెర, ఉప్పు ఉంటాయి. ఇది విషం కంటే తక్కువ కాదు. బిస్కెట్లలో కలిపే పదార్థాలు మిమ్మల్ని మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ప్రేరేపిస్తాయి. అందుకే ఒకే ఒక బిస్కెట్ తినాలని మొదలుపెట్టి మొత్తం ప్యాకెట్ అయిపోయే వరకూ వదలరు. అందువల్ల వీటిని ఇంటికి తీసుకురాకపోవడమే మంచిది.
చిప్స్, నమ్కీన్ వంటి వేయించిన స్నాక్స్..
ఇంట్లో చిప్స్, నమ్కీన్, కుర్కురే వంటి వేయించిన స్నాక్స్‌ను కూడా నిల్వ చేయకూడదు. వాటి తయారీలో శుద్ధి చేసిన పిండి, ఉప్పు, చౌకైన నాణ్యతలేని పామాయిల్‌ను ఉపయోగిస్తారు. ఇవి ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇలాంటి అనారోగ్యకరమైన వస్తువులను తీసుకురావడానికి బదులుగా డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కొని నిల్వ చేసుకోండి.
ప్లాస్టిక్ vs వెదురు : దంతాలను శుభ్రం చేయడానికి ఏ టూత్ బ్రష్ మంచిది?
ప్యాక్ చేసిన పండ్ల రసం..
ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని ఆరోగ్యకరమైనదిగా భావించి తమ ఆహారంలో చేర్చుకుంటారు చాలామంది. అయితే ఇవి వాస్తవానికి ఆరోగ్యానికి హానికరం. వాటిలో పెద్ద మొత్తంలో చక్కెర, కృత్రిమ రుచులు, రంగులు ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. వీటిని తాగితే తీపి తినాలనే కోరికలు ఎక్కువవుతాయి. ఇది ఆరోగ్యానికి మరింత చేటు చేస్తుంది.
క్యాండీ, చౌక చాక్లెట్..
మీ ఇంటికి క్యాండీలు, చౌకైన చాక్లెట్లను తెచ్చుకోవడం మానేయాలి. క్యాండీలలో కృత్రిమ రంగులు, రుచులు, భారీ మొత్తంలో చక్కెర ఉంటాయి. ఇవి ఊబకాయం, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇక చౌకైన చాక్లెట్‌లో తక్కువ నాణ్యత గల కోకో పౌడర్, వెజిటబుల్ ఆయిల్, చక్కెర, పామాయిల్ వాడతారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మీకు చాక్లెట్ కావాలనే కోరిక కలిగినప్పుడల్లా మంచి నాణ్యత గల డార్క్ చాక్లెట్ తినడం మంచిది.
శీతల పానీయాలు..
మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కోలా, ఇతర రకాల శీతల పానీయాలకు దూరంగా ఉండండి. వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ రంగులు, రుచులతో తయారైన ఇవి ఆరోగ్యానికి మేలు చేయవు. వీటిని తాగితే ఊబకాయం, మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటికి బదులుగా మీ ఆహారంలో సహజ పండ్ల రసం, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోండి.
Read Also : ఈ పదార్థాలు తింటే.. డయాబెటిస్ తక్షణమే కంట్రోల్లోకి..
ఎక్కువ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముతున్నారా.. ఇంతకు మించి వాడితే చాలా డేంజర్..
మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..