ప్లాస్టిక్ vs వెదురు : దంతాలను శుభ్రం చేయడానికి ఏ టూత్ బ్రష్ మంచిది?
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:23 PM
Plastic Vs Bamboo Tooth Brush : సాధారణంగా అందరూ పళ్లు శుభ్రం చేసుకునేందుకు ప్లాస్టిక్ టూత్ బ్రష్‌లే వాడుతున్నారు. కానీ, ప్రస్తుతం వెదురు టూత్ బ్రష్ వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు ప్లాస్టిక్ లేదా వెదురు బ్రష్‌లలో ఏది మంచిది అనే చర్చ మొదలైంది. మరి, ప్లాస్టిక్, వెదురు టూత్ బ్రష్‌ల మధ్య ఉన్న తేడాలు, లాభాలు, నష్టాలేంటో తెలుసుకోండి..

Plastic Vs Bamboo Tooth Brush : ఈ రోజుల్లో వెదురు టూత్ బ్రష్‌ల ట్రెండ్ మార్కెట్‌లో వేగంగా పెరుగుతోంది. అందరిలో పర్యావరణం గురించి పెరుగుతున్న అవగాహన ఫలితంగా ఈ మార్పు వచ్చింది. ప్రపంచంలో ప్లాస్టిక్ కాలుష్యం తీవ్రమైన సమస్యగా మారిందని అందరికీ తెలుసు. ప్లాస్టిక్ టూత్ బ్రష్‌లు ఈ సమస్యను మరింత పెంచడానికి దోహదపడతాయి. ఎందుకంటే, ప్లాస్టిక్ టూత్ బ్రష్‌లు వందల సంవత్సరాలుగా కుళ్ళిపోతూనే ఉంటాయి, దీనివల్ల పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుంది. అందుకే ప్రభుత్వం, ప్రజలు ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి, మీ దంతాలను శుభ్రం చేసేందుకు ప్లాస్టిక్, వెదురు బ్రష్‌లలో ఏది బెస్ట్ ఛాయిస్ అన్నది ఇప్పుడు చూద్దాం..
వెదురు టూత్ బ్రష్..
గత కొన్ని సంవత్సరాలుగా వెదురు టూత్ బ్రష్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిల్లో బ్రష్‌ను మొక్కల నుంచి తీసిన నైలాన్, సహజఫైబర్‌తోనూ.. హ్యాండిల్‌ను వెదురుతోనూ తయారుచేస్తారు. అందుకే ఇవి నూరు శాతం ప్లాస్టిక్ టూత్ బ్రష్‌ల కంటే పర్యవారణ హితమైనవి. బయోడిగ్రేడబుల్ కాబట్టే వీటిని వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక చూసేందుకు వెదురు టూత్ బ్రష్‌లు ప్లాస్టిక్ టూత్ బ్రష్‌ల మాదిరిగానే కనిపిస్తాయి.
వెదురు టూత్ బ్రష్ ప్రయోజనాలు..
వెదురు టూత్ బ్రష్ యొక్క హ్యాండిల్, బ్రిస్టల్స్ నైలాన్ లేదా ఇతర సహజ ఫైబర్‌లతో తయారు చేయబడతాయి. ఇవి మీ దంతాలకు సురక్షితమైనవి.
వెదురు టూత్ బ్రష్ దంతాలను బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. వెదురులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికం.
వెదురు బ్రష్ దంతాలను శుభ్రం పరచుకుంటే నోటి దుర్వాసన సమస్య కూడా తొలగిపోతుంది.
సున్నితమైన చిగుళ్ళు ఉన్నవారు వెదురు టూత్ బ్రష్ బెస్ట్ ఛాయిస్.
చిగుళ్లపై పేరుకుపోయిన పాచిని ఈ బ్రష్ సులువుగా వదిలిస్తుంది.
Peeling Skin on Hands: మీ వేళ్లపై చర్మం ఊడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే
ప్లాస్టిక్ టూత్ బ్రష్..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 448 మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది పర్యావరణానికి తీవ్రమైన ముప్పు. ప్లాస్టిక్ నేలలో కరగిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల సముద్రాలు, నదులు ఇలా భూమిపై ఉన్న వాతావరణం మొత్తం కలుషితం అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని తగ్గిస్తాయి. ఇది సమస్త జీవులకు ప్రాణాంతకం. దీనిని నివారించడానికి ప్లాస్టిక్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం చాలా ముఖ్యం.
దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఏది మంచిది?
దంతాలను శుభ్రం చేయడానికి వెదురు, ప్లాస్టిక్ టూత్ బ్రష్‌లు రెండూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దంతాలకు ఏది మంచిది? అనేది ఒక సాధారణ ప్రశ్న. వెదురు టూత్ బ్రష్‌లు పర్యావరణానికి మంచివి. బయోడిగ్రేడబుల్ కాబట్టి. వీటికి సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. మరోవైపు, ప్లాస్టిక్ టూత్ బ్రష్‌లు చౌకగా ఉంటాయి. వివిధ రకాల ఆకర్షణీయమైన బ్రిస్టల్స్‌తో లభిస్తాయి. అయితే, ఇవి పర్యావరణానికి హానికరం.రెండు రకాల టూత్ బ్రష్‌లు దంతాలను శుభ్రం చేయడంలో దాదాపు ఒకేరకంగా పనిచేస్తాయి. పర్యావరణ రీత్యా వెదురు టూత్ బ్రష్ ఎంచుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి..
How to Control Diabetes : ఈ పదార్థాలు తింటే.. డయాబెటిస్ తక్షణమే కంట్రోల్లోకి..
Noise Cancelling Headphones: అలర్ట్.. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ వాడుతారా? అయితే..
మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..