Mouth Wash Solution : ఇంట్లోనే మౌత్ వాష్ తయారు చేయడం వచ్చా.. చాలా సింపుల్..
ABN , Publish Date - Feb 16 , 2025 | 02:40 PM
Mouth Wash Solution : నోటి శుభ్రత కోసం తరచూ మార్కెట్లో కొన్న మౌత్ వాష్‌లనే వాడుతుంటాం. వీటిలో చాలా వరకూ ఆల్కహాల్, రసాయనాలతోనే తయారవుతాయి. కొన్ని రకాల మౌత్ వాష్‌ల వాసన అంతగా నచ్చకపోవచ్చు. లేదా అలర్జీలు తెప్పించవచ్చు. ఈ సమస్యలు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే సహజంగా మౌత్ వాష్ తయారు చేసుకోండి. చాలా చాలా ఈజీ. అండ్ హెల్తీ కూడా.

Mouth Wash Solution Preparation at Home : నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్ల సమస్యలు వ్యక్తిగతంగానే కాక నలుగురిలోనూ చికాకును, ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు మౌత్ వాష్ వాడటం అలవాటు చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఇవి మంచిదే అయినా.. తరచూ ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, వీటిలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ. సున్నితమైన దంతాలు, చిగుర్లు ఉన్నవారికి ఈ సొల్యూషన్స్ అలర్జీలు తెచ్చిపెట్టే ప్రమాదముంది. కాబట్టి, ఎలాంటి భయమూ లేకుండా వంటింట్లో లభించే పదార్థాలతో సొంతంగా మౌత్ వాష్ తయారుచేసుకోండి. ఆరోగ్యకరమైన, మెరిసే దంతాలు పొందండి.
ఇంట్లోనే మౌత్ వాష్ తయారు చేసుకోవడం ఎలా : మార్కెట్లో లభించే మౌత్ వాష్‌లు ఎక్కువగా వాడితే నోటిలో మంటను కలిగిస్తాయి. కాబట్టి, ఈ పద్ధతిని ఉపయోగించి ఇంట్లోనే మౌత్ వాష్ తయారు చేసుకోండి. లవంగం, కొబ్బరి నూనెను ఉపయోగించి ఇంట్లోనే సహజ మౌత్ వాష్ తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
పదార్థాలు :
1 కప్పు నీరు
1/4 కప్పు కొబ్బరి నూనె
10-12 మొత్తం లవంగాలు
10 చుక్కల పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ (నచ్చితేనే)
తయారీ విధానం :
ఒక గిన్నెలో నీటిని మరిగించి మొత్తం లవంగాలను వేసి 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నానబెట్టండి.
లవంగాలు కలిపిన నీటిని ఒక గిన్నెలోకి వడకట్టి, లవంగాలను పారవేయండి.
తర్వాత లవంగాలు తీసేసిన నీటిలో కొబ్బరి నూనె కలపండి.
కావాలనుకుంటే రిఫ్రెష్ ఫ్లేవర్ కోసం 10 చుక్కల పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి.
ఈ మౌత్ వాష్‌ని ఒక గాజు సీసాలోకి తీసుకుని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయండి.
ప్రయోజనాలు :
లవంగాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దుర్వాసనను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
లవంగాల్లో యూజెనాల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి క్యావిటీలను నివారిస్తాయి.
-కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి పుండ్లను తగ్గించడంలో సహాయపడతాయి.
పిప్పరమింట్ కలపడం వల్ల శ్వాస తాజాగా ఉంటుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది.
ఇలా వాడాలి :
మౌత్ వాష్‌ని మీ నోట్లో 30 సెకన్ల నుంచి 1 నిమిషం పాటు పుక్కిలించాక ఉమ్మివేయండి. ఎట్టిపరిస్థితుల్లో మింగకండి. మంచి ఫలితాల కోసం రోజుకు రెండుసార్లు ఉపయోగించండి.
ఇవి కూడా చదవండి..
ఈ 5 రకాల పదార్థాలు.. అన్నంతో కలిపి తింటే డయాబెటిస్..
ఈ సమస్యలు ఉన్నవారికి పాలకూర ప్రాణాంతకం..
ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..
మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.