Home » Heat
ఇంకా మే నెల రాలేదు కానీ.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ...
భానుడి భగ.. భగలు కాస్త తగ్గడంతో నగరవాసులకు(Hyderabad) ఎండల నుంచి ఉపశమనం లభించింది. రెండు రోజుల క్రితం 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు మంగళవారం 37-38 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం(Weather) చల్లబడి ఈదురుగాలులు వీస్తుండడంతో వడగాల్పుల తీవ్రత తగ్గింది. ద్రోణి గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్(Gujarat) నుంచి మధ్య మహారాష్ట్ర(Maharashtra) వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం..
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం.. మండుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి హీట్ వేవ్స్ అలెర్ట్ ప్రకటించారు. ఎండ వేడిమితో పాటు వడగాలుల తీవ్రత పెరిగింది.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
గత కొన్నిరోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది.
అవునూ.. కాలం మారింది. వర్షా కాలం లేదు.. చలి కాలం లేదు.. ఉన్నదంతా వేసవి కాలమే. అవును మరి.. సరైన వర్షాలు కురవక తాగునీరు లేక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఎల్నినో బలహీనపడుతున్నా... దాని ప్రభావం మరో మూడు నెలల వరకూ ఉంటుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జూన్ వరకూ దేశంలో అత్యంత తీవ్ర వేసవి పరిస్థితులు ఏర్పడనున్నాయి. గత నెల రెండో వారం నుంచే దేశంలో..
వర్షాకాలంలో ఎండాకాలాన్ని ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం విజయవాడలో వాతావరణం అలాంటి అనుభూతినే ఇస్తోంది. నైరుతి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించి నెలలు గడుస్తున్నా అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులు మినహా వాతావరణం చల్లబడింది లేదు. ఇక ఎండలైతే వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వడగాలుల తీవ్రతతో పలు రాష్ట్రాలు అల్లాడుతుండంతో కేంద్రం అప్రమత్తమైంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
యూపీలోని బల్లియా జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 54 మంది ప్రాణాలు కోల్పోగా.. 400 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ మరణాలకు గల కారణాలపై అధికారులు భిన్న వివరణలు ఇచ్చారు. తూర్పు ఉత్తరపరదేశ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు ఈ మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమై ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇన్చార్జ్, లక్నోకు చెందిన సీనియర్ ప్రభుత్వ వైద్యుడు ఏకే సింగ్.. మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమనే విషయాన్ని తోసిపుచ్చారు.