Share News

Telangana: ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ మూడు రోజులు కాస్త రిలీఫ్..!

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:31 AM

భానుడి భగ.. భగలు కాస్త తగ్గడంతో నగరవాసులకు(Hyderabad) ఎండల నుంచి ఉపశమనం లభించింది. రెండు రోజుల క్రితం 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు మంగళవారం 37-38 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం(Weather) చల్లబడి ఈదురుగాలులు వీస్తుండడంతో వడగాల్పుల తీవ్రత తగ్గింది. ద్రోణి గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్‌(Gujarat) నుంచి మధ్య మహారాష్ట్ర(Maharashtra) వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం..

Telangana: ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ మూడు రోజులు కాస్త రిలీఫ్..!
Telangana Weather

హైదారాబాద్‌, ఏప్రిల్‌ 10: భానుడి భగ.. భగలు కాస్త తగ్గడంతో నగరవాసులకు(Hyderabad) ఎండల నుంచి ఉపశమనం లభించింది. రెండు రోజుల క్రితం 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు మంగళవారం 37-38 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం(Weather) చల్లబడి ఈదురుగాలులు వీస్తుండడంతో వడగాల్పుల తీవ్రత తగ్గింది. ద్రోణి గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్‌(Gujarat) నుంచి మధ్య మహారాష్ట్ర(Maharashtra) వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం, అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు(Tamilnadu) వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో గురవారం నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశాలుంటాయని తెలిపారు.

మంగళవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు..

👉 ఆదర్శ్‌నగర్‌-38.2

👉 హెచ్‌సీయూ- 38.1

👉 మెట్టుగూడ- 38.1

👉 విజయ్‌నగర్‌కాలనీ-38.1

👉 మారుతీనగర్‌-37.9

👉 బన్సీలాల్‌ పేట-37.9

👉 బోరబండ- 37.9

👉 మౌలాలి-37.9

👉 కేపీహెచ్‌బీ-37.9

👉 గాజులరామారం-37.6

👉 హఫీజ్‌పేట -37.9

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 09:31 AM