Home » Heavy Rains
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తితిలీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.
Telangana: భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి వర్ణణాతీతం. వరదలకు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పంటల పొలాలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
Andhrapradesh: భారీ వర్షాలతో గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో స్థాన ఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులుగా ఉంది.
గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈరోజు(గురువారం) విజయవాడలోని జక్కంపూడి కాలనీ వరద ప్రభావిత ప్రాంతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆయన కుటుంబ సభ్యులు వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
విజయవాడలోని ఆరుగొలను గ్రామాన్ని బుడమేరు వరద చుట్టుముట్టింది. అయితే అంతకుముందు అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చటానికి చర్యలు చేపట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు తెల్లవారుజాము దగ్గర నుంచి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
Andhrapradesh: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు.
Andhrapradesh: వర్షాలు ఏపీని వీడటం లేదు. భారీ వర్షాలకు బుడమేరు మహోగ్రరూపం దాల్చడంతో బెజవాడ ముంపునకు గురైంది. ఇప్పుడిప్పుడే వరద భారీ నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్న పరిస్థితి. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డ్రైన్లు పొంగి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇంట్లో బురద.. బయట వాన! ఇంట్లో ఉండలేరు.. ఆరుబయట నిలవలేరు!! ఇదీ ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి.
బుడమేరు (Budameru) వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్..