Share News

Shivraj Singh Chouhan: ఏపీకి కేంద్రం సహాయం... శివరాజ్ సింగ్ చౌహన్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:58 PM

గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈరోజు(గురువారం) విజయవాడలోని జక్కంపూడి కాలనీ వరద ప్రభావిత ప్రాంతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‎లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Shivraj Singh Chouhan: ఏపీకి కేంద్రం సహాయం... శివరాజ్ సింగ్ చౌహన్ కీలక వ్యాఖ్యలు
Shivraj Singh Chouhan

విజయవాడ: గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈరోజు(గురువారం) విజయవాడలోని జక్కంపూడి కాలనీ వరద ప్రభావిత ప్రాంతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‎లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ....

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని కొనియాడారు. బాధితులకు సహాయ చర్యలు వేగంగా అందుతున్నాయని తెలిపారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు వేగంగా అందిస్తున్నారని చెప్పారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా వరద ప్రాంతాల్లో పర్యటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అందరం కలిసి బాధితులను గట్టెక్కించాలని అన్నారు. తాను వరద ప్రాంతాలను పరిశీలించానని శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు.


ALSO READ: Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు వైరల్ ఫీవర్

పరిస్థితులు అదుపులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కృష్ణా నది, బుడమేరు పొంగిందని చెప్పారు. సీఎం చంద్రబాబు కలెక్టరేట్‎నే సెక్రటేరీయేట్ చేసుకున్నారని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు అండ్ టీం 24 గంటలు పని చేసి బాధితులకు అండగా నిలిచారని అన్నారు. కేంద్రప్రభుత్వం ఏపీకి పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇంతటి జలప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగారని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.


ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారి అని వివరించారు. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని వివరించారు. ప్రకాశం బ్యారేజ్‎ 70 ఏళ్ల పురాతనమైందని తెలిపారు. మరింత వరద వచ్చినా...15 లక్షలు క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టపరుస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ మాటిచ్చారు.


ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చిస్తామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై నిపుణులతో చర్చిస్తామని చెప్పారు. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరగడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని తెలిసిందని అన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బృందాలు వరద నష్టంపై అంచనాలు వేస్తాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనా పథకాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుందని తెలిపారు. వరద నష్టం అంచనాపై క్లారిటీ రాగానే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ హామీ ఇచ్చారు.


ALSO READ: AP Politics: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..

2 రోజుల్లో 40 సెంటి మీటర్లు వర్షపాతం: సీఎం చంద్రబాబు

అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... వాతావరణ మార్పుల వల్ల రెండు రోజుల్లో 40 సెంటి మీటర్లు వర్షపాతం ఈ ప్రాంతంలో పడిందని అన్నారు. బుడమేరు వద్ద పెద్ద ఎత్తున పైనుంచి నీరు వచ్చిందని తెలిపారు. 7 వేల నుంచి 10 వేల క్యుసెక్కుల కెపాసిటీ ఉన్న ప్రాంతంలో.. 36 వేల క్యుసెక్కులకు పైగా వరద వచ్చిందని వివరించారు. ప్రకాశం బ్యారేజ్‎ను మరింత పటిష్టం చేయడంతో పాటు బండ్‎లు మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంట్లోని ప్రతి వస్తువు పాడై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మిలటరీ వచ్చి బ్రీచ్‎లను క్లోజ్ చేసే పనిలో సాయం చేస్తారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ALSO READ: AP FLOODS: మళ్లీ పొంగిన బుడమేరు.. రాకపోకలకు అంతరాయం

2019లో బుడమేరు అభివృద్ధి పనులను వైసీపీ రద్దు చేసింది: సీఎం చంద్రబాబు

CM-chandrababu.jpg

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఏరియల్ సర్వే చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి చూశారని అన్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతమంతా వర్షాలు పడ్డాయని చెప్పారు బుడమేరు పొంగడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయని అన్నారు. బుడమేరు వాగు ఆధునికీకరణ కోసం పనులు ప్రారంభిస్తే.. 2019లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టపరచాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నదీ కరకట్టలను మరింత బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Narayana: రేపే నిత్యవసరాల పంపిణీ.. మంత్రి నారాయణ సమీక్ష

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 09:48 PM