Share News

Heavy Rains: మైలవరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ABN , Publish Date - Sep 05 , 2024 | 09:21 AM

Andhrapradesh: వర్షాలు ఏపీని వీడటం లేదు. భారీ వర్షాలకు బుడమేరు మహోగ్రరూపం దాల్చడంతో బెజవాడ ముంపునకు గురైంది. ఇప్పుడిప్పుడే వరద భారీ నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్న పరిస్థితి. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డ్రైన్‌లు పొంగి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Heavy Rains: మైలవరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
Heavy Rains in Mylavaram

అమరావతి, సెప్టెంబర్ 5: వర్షాలు ఏపీని వీడటం లేదు. భారీ వర్షాలకు (Heavy Rains) బుడమేరు మహోగ్రరూపం దాల్చడంతో బెజవాడ ముంపునకు గురైంది. ఇప్పుడిప్పుడే వరద భారీ నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్న పరిస్థితి. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డ్రైన్‌లు పొంగి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Khammam: ఇంట్లో బురద.. బయట వాన



లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చండ్రగూడెం మల్లయ్య కుంటకు గండి పడింది. కొండ వాగు ప్రవాహంతో పొందుగల చౌడు చెరువు కింద వరి పొలాలు నీట మునిగాయి. వెల్వడం వద్ద ప్రమాదకర స్థాయిలో బుడమేరు ప్రవహిస్తోంది.

Nandigam Suresh: హైదరాబాద్‌లో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్..


సురక్షిత ప్రాంతాలకు బాధితులు...

బుడమేరు వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్‌ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌, రాధానగర్‌, డాబాకొట్లు సెంటర్‌, ఇందిరానాయక్‌ నగర్‌, పైపులరోడ్డు, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నాటికి రెండు నుంచి మూడు అడుగుల మేర సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల్లో వరద మట్టం తగ్గింది. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వరద బాధితులు బయటకు వచ్చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం నాటికి కండ్రిక, అంబాపురం వైపు ఉన్న ఆంధ్రప్రభ కాలనీ 11లో ఇంకా మెడలోతు నీటితోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 75 వేల మంది బుధవారం మధ్యాహ్నానికి బయటకు వచ్చేశారు. ఇంకో 75 వేల మంది బయటకు రావల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

Weekend Sleep: వారాంతాల్లో తనివితీరా నిద్రతో హృద్రోగాల నుంచి రక్షణ లభిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 09:36 AM