Home » Himanta Biswa Sarma
గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్‌షీట్ కుంభకోణం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను బీజేడీ నేత వీకే పాండియన్ 'కంట్రోల్' చేస్తు్న్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసిన వీడియో సంచలనమవుతోంది. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వాఖ్యాలపై బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విరుచుకుపడ్డారు. లాలూ పాకిస్థాన్‌కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు.
ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు మేనిఫెస్టో ( Manifesto ) ప్రకటిస్తుంటాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న పనులను ముందుగానే ఓటర్లకు వెల్లడిస్తుంటాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తాయి.
అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మకు , ధుబ్రి ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కు మధ్య మాటలు తూటాలు పేలాయి. మీరు కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి, యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే మాత్రం బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుందంటూ బద్రుద్దీన్‌పై శర్మ విసుర్లు విసిరారు.
లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పంపిన సమన్లను బేఖాతరు చేశారని, తద్వారా తన అరెస్ట్‌ని తానే కోరితెచ్చుకున్నారని అన్నారు. ఒకవేళ.. తనకు తొలిసారి సమన్లు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, అరెస్ట్ అయ్యేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ ఖండిస్తూ.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తిప్పికొట్టారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న ఏ ఏజెన్సీ వల్లనో కాదని, తన సొంత చర్యల వల్లేనని పేర్కొన్నారు. దర్యాప్తులో కేంద్ర సంస్థలకు కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. ‘మేము తినము, ఇతరుల్ని తిననివ్వము’ అనే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ఓ హెచ్చరిక జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన నేతల్లో చాలామంది బీజేపీలోకి (BJP) చేరుతారని పేర్కొన్నారు. కాబట్టి.. ఆ ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు.