Home » Hindupur
వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది.
పట్టణానికి చెందిన నృత్యకారిణి చంద్రబాను చతుర్వేది భరతనాట్యంలో ప్రతిభ కనబరచి, అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఉత్తరప్రదేశలోని కాశీవిశ్వనాథుడి సన్నిధిలో సోమవారం నిర్వహించి న అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఆమె తన బృందంతో కలిసి పాల్గొన్నారు. 9 వేల మంది నృత్యకారిణులు భరతనాట్యం, కూచిపూడి, కథక్ తదితర నృత్యాలు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా హిందూపురం ప్రసిద్ధి. కర్ణాటక రాజధాని బెంగళూరు దగ్గరగా ఉండటంతో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారింది. అయితే అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉంది. పట్టణంలోని ప్రముఖ ప్రాంతాలైన టీచర్చ్ కాలనీ, హౌసింగ్‌బోర్డు, కరెంటు రంగప్ప లే అవుట్, డీఆర్ కాలనీ, శ్రీకంఠపురం పాత ఊరు, సీపీఐ కాలనీ పక్కన తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపల్ పీఠం అధిష్టించేందుకు టీడీపీకి లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కువమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్ పీఠం సులువుగా టీడీపీ పరం కానుంది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో..
రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునే బాలయ్య.. శుక్రవారం బస్సు నడిపి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ (Nadamuri Balakrishna) ప్రారంభించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి మంజులవాణి సిబ్బందికి సూచించారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.
మండలంలోని పలు అంగనవాడీ కేంద్రాలను సీడీపీఓ అనురాధ గురువారం తనిఖీ చేశారు. ఎగువ గంగంపల్లిలోని రెండు అంగనవాడీ కేంద్రాలు, ఎర్రయ్యగారిపల్లి, గోరంట్ల-5వ అంగనవాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
అనుమతిలేని లేఔట్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. నగర పంచాయతీ కమిషనర్‌కు సూచించారు. లేఔట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం పెంచాలన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
కోర్టు, పోలీసుల సమన్వయంతో 29వ తేదీన నిర్వహించే మెగా లోక్‌అదాలతను విజయవంతం చేద్దామని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శుక్రవారం పోలీసులతో మెగా లోక్ అదాలతపై సమీక్ష జరిపారు.
మండలంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బడిమానేసిన ఇద్దరు పిల్లలను ఎంఈఓ జానరెడ్డెప్ప శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎనుములకొట్టపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, శివమ్మ కుమారుడు గంగరాజు గొర్రెలు కాస్తున్నాడు.