Home » Hyderabad
రామంతాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో శ్రీనివాసపురంలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 19న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ ఉండబోదని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కె.లావణ్య(Transco AE K. Lavanya) ఒకప్రకటనలో తెలిపారు.
సహజవనరులను ప్రజలకు ఉపయోగపడే విధం గా చెరువులను సుందరీకరించడం ప్రస్తుతం అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) అన్నారు. ఇటీవల గ్రేటర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెరువుల సుందరీకరణ అంశంపై ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాధ్‌రెడ్డి అధికారులు చందానగర్(Chandanagar) సర్కిల్ పరిధిలోని బచ్చెకుంట, రేగుల కుంట చెరువుల సుందీకరణ పనులు చేపట్టాలని కోరారు.
ఢిల్లీకి మూటలు మో యడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ఎత్తుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Former MLA Chinthala Ramchandra Reddy) ఆరోపించారు. సోమవారం మన్నెగూడకు వచ్చిన ఆయన పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణిరుద్రమ, బండారు విజయలక్ష్మి, సునితతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, మైకులను ఏర్పాటు చేసి రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. తద్వారా మంచి ఫలితాలు వస్తుండడంతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మరికొన్ని చోట్ల ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్ వీకర్ సెక్షన్) 66గజాల్లో ఓ చిన్నపాటి కుటుంబం ఉండడం ఒకే.. ఇప్పుడు అదే స్థలంలో ఆరు అంతస్తుల పేక మేడలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ మూసాపేట్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తుండడం గమనార్హం.
సరికొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్ బాయ్ అనుచిత ప్రవర్తనపై కస్టమర్ ఫిర్యాదు చేస్తే.. నమోదు చేయాలంటే రూ. 10 చెల్లించాలని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అతడి ఖాతా నుంచి రూ. 4.68 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత(సైబర్ క్రైమ్ డీసీపీ కవిత) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి ఫ్లిప్‌కార్ట్ పార్శిల్ వచ్చింది. కొరియర్ బాయ్ కస్టమర్‌ను పేరు పెట్టి గట్టిగా పిలిచాడు.
సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) శ్రీధర్ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ కు 18521/18522 నంబర్లను కేటాయించారు.
ఇన్స్టాగ్రామ్(Instagram)లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం పెడదామని తీసుకెళ్లి హత్యచేశాడో యువకుడు. మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్(Miyapur Inspector Krantikumar) తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ ప్రాంతానికి చెందిన దంపతుల కుమార్తె(17) 20 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్ (Banjara Hills) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ గోపి(ADE Gopi) తెలిపారు.
సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు సచివాలయ అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత కొత్త సంఘానికి సోమవారం ఎన్నికలు జరిగాయి.