Share News

Hyderabad: 66 గజాలు.. 6 అంతస్తులు

ABN , Publish Date - Nov 19 , 2024 | 08:31 AM

ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్‌ వీకర్‌ సెక్షన్‌) 66గజాల్లో ఓ చిన్నపాటి కుటుంబం ఉండడం ఒకే.. ఇప్పుడు అదే స్థలంలో ఆరు అంతస్తుల పేక మేడలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారుల కనుసన్నల్లోనే అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తుండడం గమనార్హం.

Hyderabad: 66 గజాలు.. 6 అంతస్తులు

- కేపీహెచ్‌బీలో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల అండదండలతో పేక మేడలు..

- 10 అడుగుల రోడ్లలో హాస్టళ్ల ఏర్పాటు

- ప్రమాదం జరిగితే అంతే!

- స్థానికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని అధికారులు

హైదరాబాద్: ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్‌ వీకర్‌ సెక్షన్‌) 66గజాల్లో ఓ చిన్నపాటి కుటుంబం ఉండడం ఒకే.. ఇప్పుడు అదే స్థలంలో ఆరు అంతస్తుల పేక మేడలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌(GHMC Moosapet Circle Town Planning) అధికారుల కనుసన్నల్లోనే అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తుండడం గమనార్హం. ఏదైని ప్రమాదం సంభవిస్తే బయట పడడానికి కూడా వీల్లేదు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సరికొత్త ‘సైబర్’ మోసం వెలుగులోకి.. ఎలా జరిగిందంటే..


అత్యవసరం నిమిత్తం ఆయా గల్లీల్లోకి ఫైరింజన్‌ కూడా వెల్లదు. ఇంత ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అధికార యంత్రాంగనికి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో ఆయా ప్రాంతాల నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి జోన్‌కు ఐఏఎస్‌ ఉన్నా ఆయన క్షేత్రస్థాయిలో జరిగే వాటిపై దృష్టిపెట్టకపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా సాగుతోంది.


ఆరు అంతస్తుల పేక మేడలు..

66గజాల్లో ఆరు, ఏడు అంతస్తులు నిర్మిస్తూ హాస్టళ్లకు అద్దెకిచ్చి వేరే చోట నివాసాలకు వెళ్లిపోవడం ఇప్పుడు సర్వసాధారణమైందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 40, 30 అడుగుల రోడ్డులో మాత్రమే ఉండే వసతి గృహాలు.. బైక్‌లు కూడా వెళ్లలేని గల్లీలకు వందల మంది విద్యార్థులకు పేక మేడలు నిర్మిస్తుండడంతో సొంత ఇంటిలో ఉం డే పలువురు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఉన్న గోడనే వాడుకోడం

ఒక్కో ఇంటికి కనీసం గోడ కూడా నిర్మాణం చేసుకోవడం లేదు. అన్నింటినీ కలిపి గాలి, వెలుతురు కోసం స్థలం వదలడం అటు ఉంచితే ఎవరి ఇంటికి వారు గోడలు కూడా నిర్మించుకోకుండా పక్కన ఉన్న భవనం గోడనే వాడుకోడం పరిపాటిగా మారింది. హాస్టళ్ల కోసం ఆరు, ఏడు అంతస్తుల పేక మేడలు నిర్మించి వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులకు ఆవాసం కల్పిస్తున్నారు. దీంతో ఆయా గల్లీలో బైక్‌ పార్కింగ్‌ అలా ఉంచితే ఆ మార్గంలో రాకపోకలు సాగించడమే కష్టంగా ఉందని చెప్పొచ్చు. ఒక్కో ఈబ్ల్యూఎ్‌సకు కుటుంబం నివాసం ఉంటే రూ. 8నుంచి 10వేలు అద్దె.. అదే హాస్టల్‌కు ఇస్తే నెలకు రూ. 1.2లక్షల వరకు వస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎంతో కలిసి మెలసి ఉన్న వారు సైతం అద్దె కోసం కక్కుర్తిపడి అక్కడ నివాసం ఉండే వారు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా అమ్ముకోవడం లేదా హాస్టల్‌ కోసం పేక మేడలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్థానికుల గోస వినేదెవరు?

కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాపు నుంచి రెండో రోడ్డు వరకు మధ్యలో ఉన్న ఈడబ్ల్యూఎస్‌ గృహాల్లో ఇప్పుడు సామాన్య ప్రజలు నివాసం ఉండడం కష్టంగా మారింది. మూడు రోడ్డులో గల్లీల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్‌ గృహాల మధ్య హాస్టళ్లు ఏర్పాటు చేయొద్దని పదుల సంఖ్యలో స్థానికులు కొన్ని నెలలుగా మొరపెట్టుకుంటున్నా ఆలకించే నాథుడే కరువయ్యారు. ఆదివారం కూడా ప్లకార్డులు చేతబూని ఉన్న హాస్టళ్లను తొలగించడంతో పాటు కొత్తగా కట్టే పేక మేడల్లో వసతిగృహాలు ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆందోళన చేశారు.


ప్లాన్‌ ఒకటి.. నిర్మాణం మరోలా..

జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకునే ప్లాన్‌ ఒకటి.. క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసే ప్లాన్‌ మరొకటి. తెరవెనుక అంతా టౌన్‌ప్లానింగ్‌ అధికారులే ఉండి నడిపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులకు గండి కొడుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఆర్కిటెక్చర్స్‌ను కూడా టౌన్‌ప్లానింగ్‌ అధికారులే సమకూరుస్తున్నారనే సమాచారం. వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వండి.. వారి సూచనల మేరకు మీరు ఇళ్లు ఎన్ని ఫ్లోర్లు అయినా నిర్మించుకోండి.. మేము అడిగినంత ఇచ్చుకుంటే ఒకే.. లేదంటే మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే కూల్చివేతల్లో మీదే ఉండదని ముందే హెచ్చరిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 08:31 AM