Home » Hyderabad
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇక్కడ పథకాలు అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3వేలు ఇస్తామనడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్‌పై వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ అగ్నిప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో 10మంది చిన్నారులు మృతిచెందడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలు తెలంగాణలో చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లగచర్లలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
సర్వేతో తాను అంటే మరోసారి ఫ్రూవ్ చేసుకున్నారు కేకే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పక్కా అంచనాలు వేశారు. మహాయుతి కూటమి 225 సీట్లు గెలుస్తోందని లెక్క వేయగా.. దాదాపు అన్ని సీట్లలో కూటమి లీడ్‌లో ఉంది.
మనం కొత్త వస్తువు కొన్నపుడు అది పనిచేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు తప్పనిసరిగా వస్తువుతో పాటు అందించే సూచనల పుస్తకం (మ్యాన్యువల్ బుక్) ను పూర్తిగా చదవాలి. కానీ మనలో చాలా మంది అదేమి పట్టించుకోకుండా నేరుగా వస్తువులను వాడుతుంటాం.
సిక్కులు లంగర్ సేవ (అన్నదానం)కు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి గురుద్వారాలో లంగర్ సేవలు నిర్వహిస్తూ కులమతాలకతీతంగా ఆకలితో వచ్చిన వారికి ఉచితంగా భోజనం అందిస్తారు. తెలంగాణ(Telangana)లో ఉన్న 52 గురుద్వారాలలో ఈ లంగర్ సేవ కొనసాగుతుంది.
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్హాల్లో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదు వర్క్‌షాపు నిర్వహించారు.
తమ కుటుంబంలో జరిగిన దారుణం మరో కుటుంబంలో జరగకూడదని, అమెరికా వెళ్లిన తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం తెలుసుకోవాలని, ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాలని అమెరికా జార్జియా(America)లో మృతి చెందిన ఆర్యన్‌రెడ్డి(Aryan Reddy) తండ్రి పాల్వాయి సుదర్శన్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేపత్రాలు రోడ్డుపక్కన పడేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జవహర్‌నగర్ కార్పొరేషన్(Jawaharnagar Corporation)లో ఈ విషయం చోటుచేసుకుంది.