Share News

Harish Rao: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై హరీశ్ రావు ఫస్ట్ రియాక్షన్..

ABN , Publish Date - Nov 23 , 2024 | 05:25 PM

తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇక్కడ పథకాలు అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3వేలు ఇస్తామనడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన చెప్పుకొచ్చారు.

Harish Rao: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై హరీశ్ రావు ఫస్ట్ రియాక్షన్..
Former Minister Harish Rao

హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఐదు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ఆ రాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని ఈ ఎన్నికల ద్వారా తేలిందని మాజీ మంత్రి అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు తొలిసారి స్పందించారు.

Maharashtra Assembly Election Results: కేకే సర్వే సీక్రెట్ ఏమిటి..


కాంగ్రెస్‌కు గుణపాఠం..

తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని హరీశ్ రావు అన్నారు. ఇక్కడ పథకాలు అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3వేలు ఇస్తామనడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన చెప్పుకొచ్చారు. రైతు భరోసా ఎగ్గొట్టారని, ఆసరా ఫించన్లను సైతం పక్కన పెట్టేశారని ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటి అంశాలను మహా ప్రజలు గమనించారని ఆయన తెలిపారు. ఈ అంశాలన్నీ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టాయని హరీశ్ రావు అన్నారు.

KTR: ఆ భూములు లాక్కుంటే ఊరుకోం.. రేవంత్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్


అందుకే ఓడించారు..

తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్నారని, కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయని హరీశ్ రావు అన్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులు కాంగ్రెస్ అబద్ధపు హామీలపై అక్కడ ప్రచారం చేశారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిందని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Hyderabad: కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ దాఖలు.. ఎందుకంటే..


బీజేపీవి కక్షసాధింపు రాజకీయాలు..

అలాగే జార్ఖండ్ ఎన్నికలపైనా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‍పై బీజేపీ పార్టీ అక్రమ కేసులు పెట్టిందని, ఆయన్ని అరెస్టు చేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. అలాగే హేమంత్ సోరెన్ పార్టీని సైతం చీల్చేందుకు కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. దీన్ని గమనించిన జార్ఖండ్ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఓడించారని ఆయన చెప్పారు. బీజేపీ కక్షసాధింపు విధానాలని ప్రజలు హర్షించడం లేదని తేలిపోయిందని అన్నారు. విజయం సాధించిన హేమంత్ సోరెన్‌కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Priyanka Gandhi Journey: ప్రధాన కార్యదర్శి నుంచి పార్లమెంట్ దాకా.. ప్రియాంకా ప్రయాణం ఇదే..

Minister Raja Narasimha: అలాంటి పరిస్థితి తెలంగాణకు రావొద్దు: మంత్రి రాజనర్సింహ..

Updated Date - Nov 23 , 2024 | 05:33 PM