Share News

Hyderabad: కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ దాఖలు.. ఎందుకంటే..

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:37 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్‌పై వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు.

Hyderabad: కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ దాఖలు.. ఎందుకంటే..
BRS working president KTR

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్‌పై వ్యాపారవేత్త సూదిని సృజన్‌ రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్‌ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో తాను కోర్టుకెక్కినట్లు సృజన్‌ రెడ్డి తెలిపారు.

KTR: ఆ భూములు లాక్కుంటే ఊరుకోం.. రేవంత్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్


అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సృజన్‌ రెడ్డి పిటిషన్‌ వేశారు. 2011లో శోధ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభమయ్యిందని, ఆ కంపెనీకి ఎండీగా కందాల దీప్తిరెడ్డి వ్యవరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆ సంస్థలో తనకు ఎటువంటి షేర్లు లేవని చెప్పారు. కనీసం తాను కంపెనీ డైరెక్టర్‌ కూడా కాదని స్పష్టం చేశారు. అయితే శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనను లింక్ చేస్తూ కేటీఆర్ అందర్నీ తప్పుదారి పట్టిస్తున్నారంటూ సృజన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అమృత్-2లో ప్యాకేజీ-1 కాంట్రాక్ట్‌ను ఏఎమ్ఆర్-శోధ-ఐహెచ్‌పీ జాయింట్ వెంచర్‌ కింద దక్కించుకున్నారని ఆయన తెలిపారు.

Maharashtra Assembly Election Results: కేకే సర్వే సీక్రెట్ ఏమిటి..


జాయింట్ వెంచర్‌లో కేటీఆర్ చెబుతున్నట్లు శోధకు 80 శాతం కాకుండా 29 శాతం మాత్రమే వాటా ఉందని సృజన్ రెడ్డి వెల్లడించారు. అమృత్ పనులకు ఈ-టెండర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారని, పారదర్శక విధానంలోనే కేటాయింపులు జరిగినా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రిగా కేటీఆర్‌కు టెండర్ల విధానంపై స్పష్టమైన అవగాహన ఉందని, అయినా తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఆయన తరచూ ఆరోపణలు చేస్తున్నారని సృజన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు సృజన్‌ రెడ్డి చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Priyanka Gandhi Journey: ప్రధాన కార్యదర్శి నుంచి పార్లమెంట్ దాకా.. ప్రియాంకా ప్రయాణం ఇదే..

Minister Raja Narasimha: అలాంటి పరిస్థితి తెలంగాణకు రావొద్దు: మంత్రి రాజనర్సింహ..

Updated Date - Nov 23 , 2024 | 04:46 PM