Home » HYDRA
హైడ్రా ఏర్పాటు, ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్టీఎల్లో ఎలాంటి భద్రత లేకుండా ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడానికి ఎవరు ధైర్యం చేయబోరని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 99పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఉల్లంఘించినట్లేనని సున్నం చెరువు బాధితులు వాపోతున్నారు. మాదాపూర్(Madapur)లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
చెరువులను చెరబట్టిన వారిపై ‘హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా)’ ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది.
అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)ను ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా రంగంలోకి దిగిన నెలల వ్యవధిలోనే వందల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలను చేసుకోవచ్చా అని భక్తులకు సందేహం ఉండేది. ఈ సందేహాలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సాగర్లో మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా.. ఆ నిర్మాణాల అనుమతుల జారీపైనా దృష్టి సారించింది. పర్మిషన్లు ఎవరిచ్చారు?
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇళ్లు ఉన్నా.. వాటిలో ఇప్పటికే పౌరులు నివాసముంటున్నట్లయితే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటన చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని..