Share News

TG High Court: హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 10 , 2024 | 09:48 PM

హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలను చేసుకోవచ్చా అని భక్తులకు సందేహం ఉండేది. ఈ సందేహాలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సాగర్‌లో మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

TG High Court:  హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలను చేసుకోవచ్చా అని భక్తులకు సందేహం ఉండేది. ఈ సందేహాలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సాగర్‌లో మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనాలు చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో తయారైన విగ్రహాలను మాత్రం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక లేదా కృత్రిమ నీటికుంటల్లో నిమజ్జనం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం విషయంలో 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని హైకోర్టు సూచించింది.


కాగా సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టు ఆదేశాలను పాటిచడం లేదని ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ కోర్టు ధిక్కార ఆధారాలు చూపలేకపోయారని చెప్పింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కార పిటిషన్ సరికాదని హైకోర్టు తెలిపింది.


హైడ్రాను ప్రతివాదిగా చేర్చలేమని హైకోర్టు స్పష్టం చేసింది. గత ఆదేశాలు ఇచ్చిన సమయంలో హైడ్రా లేదని గుర్తుచేసింది. హైడ్రాను ప్రతివాదిగా ఎలా చేరుస్తామని నిలదీసింది. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రత్యేక ఆదేశాలకు అవసరమైతే పిటిషనర్ రిట్ దాఖలు చేయొచ్చని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..

CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు

Danam Nagender: బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: దానం నాగేందర్

Updated Date - Sep 10 , 2024 | 09:51 PM