Home » HYDRA
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.
Telangana: హైడ్రా పేరు చెప్పి లంచాలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్న ఏసీబీ డీజీ హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా పేరుతో కొందరు ప్రైవేటు , ప్రభుత్వ అధికారులు పాత నోటీసులు ఇస్తున్నారన్నారు. ఫిర్యాదులను సాకుగా చూపి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తుట్లు తమ నోటీసుకి వచ్చిందన్నారు.
సోషల్ వర్కర్ ముసుగులో హైడ్రా పేరు చెప్పి రూ. 20 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్ చేసిన వ్యక్తిపై అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్(Sangareddy District Aminpur) మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్ పేరుతో జూబ్లీహిల్స్(Jubilee Hills)కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు.
Telangana: హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్‌సీఓఆర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీని నిర్మిస్తున్న బిల్డర్‌కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
హైడ్రా ఆదేశాల మేరకు.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను జిల్లా యంత్రాంగం మంగళవారం కూల్చివేసింది.
రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార గమనాన్ని.. ‘హైడ్రా’ పూర్తిగా మార్చేసిందనడంలో సందేహం లేదు. చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ల గురించి వినియోగదారుల్లో అది తెచ్చిన అవగాహన అంతా ఇంతా కాదు!!
హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్న హైడ్రా, ఇరిగేషన్ అధికారులు
క్రిమినల్ కేసుల్లో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.
చినుకు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. తేలికపాటి జల్లులకే నగరం చిత్తడి అవుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని కాలనీలు జలమయం అయ్యాయి. గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు ఉన్నాయి. దాంతో సిటీలో కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చింది.