BRS vs Congress: హైదరాబాద్‌పై రేవంత్‌కు కక్ష.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 28 , 2024 | 05:03 PM
ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పేద మహిళ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని కేటీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యనేనని కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పేద మహిళ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై ప్రభుత్వం సానుభూతి తెలిపిందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలే ఇళ్లకు అనుమతులు ఇచ్చాయన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం పేదలకు మాత్రమే ఉంటుందా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇష్టారీతిన వ్యవహారిస్తోందని ఆరోపించారు. పేద ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఎందుకు గెలిపించామా అంటూ ఇప్పటికే చాలామంది సామాన్య ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.
Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే
రేవంత్ అన్నకు రూల్స్ వర్తించవా..
నిబంధనలు పేదలకు మాత్రమే వర్తిస్తాయా అంటూ కేటీఆర్ రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అన్నకు నోటీసులు ఇచ్చి వదిలేశారన్నారు. పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇళ్లు అయినా కట్టిందా అని ప్రశ్నించారు. హైడ్రాతో ఆర్ధిక శాఖా మంత్రి ఏం పనని, ఒకరిద్దరు బిల్డర్ల పేర్లు చెప్పి పైసలు వసూలు చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై రేవంత్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలన్నారు. బుచ్చమ్మ కుటుంబానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఆర్ధిక సహాయం చేశారని గుర్తుచేశారు. హైడ్రా భాదితులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. హైదరాబాద్ నగరం మొత్తం బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిందని ఇక్కడి ప్రజలపై రేవంత్ రెడ్డి కక్ష కట్టారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ తరపున న్యాయ సహాయం చేస్తాని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Jethwani Case: కుక్కల విద్యాసాగర్‌కు షాకిచ్చిన హైకోర్టు
Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే
Hyderabad: రూ.8 కోట్లు ఇవ్వలేదని భర్తను హత్య చేసి.. పోలీసులకు దొరక్కుండా..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here