Home » I.N.D.I.A
విపక్ష కూటమి ఇండియా పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇండియా కూటమిపై మోదీ విరుచుకుపడ్డారు. ఇండియానుంచి కుటుంబ పాలనకు, అవినీతికి, అవకాశవాద రాజకీయాలకు ముక్తి లభించాలన్నారు. నిన్న రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల కూటమికి సెమీ ఫైనల్స్ అని.. సెమీస్‌లోనే ఇండియా కూటమి ఓడిపోయిందన్నారు.
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్‌కి 1 గంట 9 నిమిషాలు, డీఎంకేకి 30 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 30 నిమిషాలు, వైఎస్సార్సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, జేడీయూకి 21 నిమిషాలు, బీజేడీకి 16 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు, బీఆర్ఎస్‌కి 12 నిమిషాలు, ఎల్‌జేఎస్పీకి 8 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత నూతనోత్సాహంతో మంగళవారం ఉదయం పార్లమెంటుకు బయల్దేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించబోతున్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కొత్త పేరు పెట్టారు. ఇకపై ఈ పేరుతోనే పిలవాలని ఎన్డీయే భాగస్వాములను కోరారు. ఎన్డీయే ఎంపీలను బృందాలవారీగా కలుస్తున్న ఆయన గురువారం బిహార్ ఎంపీలతో సమావేశమయ్యారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమావేశమయ్యారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు.
తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని మణిపూర్ గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey)ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి, సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడారు.
హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు బయల్దేరారు. వీరు శని, ఆదివారాల్లో ఈ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల పరిస్థితిని సమీక్షిస్తారు. కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, పార్లమెంటుకు సిఫారసులు చేస్తారు.
మణిపూర్‌లో మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం బిష్ణుపూర్ సమీపంలోని మొయిరంగ్‌లో రెండు వర్గాల మధ్య తుపాకులతో ఘర్షణ జరిగింది. కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు.
ప్రతిపక్ష కూటమి ఇండియా నేతల బృందం త్వరలో మణిపూర్ సందర్శించబోతోంది. ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఈ బృందానికి నాయకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఇండియా కూటమి ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ సమస్యపై మోదీ ప్రకటన చేయాలని పట్టుబడుతూ, తమ నిరసనను మరింత తీవ్రంగా వ్యక్తం చేసేందుకు నల్ల దుస్తులతో పార్లమెంటుకు హాజరవాలని నిర్ణయించారు.