no confidence motion news: అవిశ్వాసం తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో కేటాయించిన సమయం ఎంతో తెలుసా...

ABN , First Publish Date - 2023-08-08T12:10:14+05:30 IST

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్‌కి 1 గంట 9 నిమిషాలు, డీఎంకేకి 30 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 30 నిమిషాలు, వైఎస్సార్సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, జేడీయూకి 21 నిమిషాలు, బీజేడీకి 16 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు, బీఆర్ఎస్‌కి 12 నిమిషాలు, ఎల్‌జేఎస్పీకి 8 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు.

no confidence motion news: అవిశ్వాసం తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో కేటాయించిన సమయం ఎంతో తెలుసా...

న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్‌కి 1 గంట 9 నిమిషాలు, డీఎంకేకి 30 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 30 నిమిషాలు, వైఎస్సార్సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, జేడీయూకి 21 నిమిషాలు, బీజేడీకి 16 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు, బీఆర్ఎస్‌కి 12 నిమిషాలు, ఎల్‌జేఎస్పీకి 8 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు. మిగిలిన ఎన్‌డీఏ అనుకూల పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 17 నిమిషాలు కేటాయించారు. ఇందులో అన్నాడీఎంకే, ఏజేఎస్‌యూ, ఎంఎన్ఎఫ్, ఎన్‌పీపీ, ఎస్‌కేఎం వంటి పార్టీలు ఉన్నాయి. ఇక ఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ, టీడీపీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలన్నింటికి కలిపి 52 నిమిషాల సమయం ఇచ్చారు. బీజేపీ తరపున 15 మంది వక్తలు మాట్లాడనున్నారు. నిషికాంత్ దూబే మొదటి వక్తగా వ్యవహరిస్తారు.


బీజేపీ తరపున మాట్లాడేది వీరే..

విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడనున్న వారి జాబితాను బీజేపీ (BJP) విడుదల చేసింది.

జాబితా ఇదే..

1. అమిత్ షా.

2. నిర్మలా సీతారామన్.

3. కిరెన్ రిజిజు.

4. జ్యోతిరాధిత్య సింథియా.

5. స్మృతి ఇరానీ.

6. లాకెట్ ఛటర్జీ.

7. బండి సంజయ్ కుమార్.

8. రామ్ కృపాల్ యాదవ్.

9. రాజ్‌దీప్ రాయ్.

10. విజయ్ భాగెల్.

11. రమేష్ బింధూరి.

12. సునీత దుగ్గల్.

13. హీనా గావిట్.

14. నిశికాంత్ దూబే.

15. రాజ్యవర్థన్ రాథోర్.

కాగా బీజేపీ తరపున మాట్లాడబోయే నేతల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు లేకపోవడం గమనార్హం. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ నోరుతెరవాలని, పార్లమెంట్‌లో చర్చించాలని విపక్ష పార్టీలు ఎంతగానో డిమాండ్ చేశాయి. అయినప్పటికీ స్పందనలేకపోవడంతో అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు మొగ్గుచూపాయి. అయినప్పటికీ బీజేపీ విడుదల చేసిన పార్టీ నేతల జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం.

Updated Date - 2023-08-08T12:16:06+05:30 IST