No Confidence Motion : నూతనోత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరిన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానంపై గర్జించబోతున్న యువ నేత..

ABN , First Publish Date - 2023-08-08T09:15:49+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత నూతనోత్సాహంతో మంగళవారం ఉదయం పార్లమెంటుకు బయల్దేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించబోతున్నారు.

No Confidence Motion : నూతనోత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరిన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానంపై గర్జించబోతున్న యువ నేత..
Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత నూతనోత్సాహంతో మంగళవారం ఉదయం పార్లమెంటుకు బయల్దేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించబోతున్నారు. ఆయన మోదీ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టబోతున్నారు.

కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, అవిశ్వాస తీర్మానంపై చర్చను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారు. రాహుల్ జూన్‌లో మణిపూర్‌లో పర్యటించి, స్థానిక పరిస్థితులను తెలుసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) ఎంపీలు కూడా ఆ రాష్ట్రంలో పర్యటించి, స్థానిక సమస్యలను పరిశీలించి, గవర్నర్‌కు, రాష్ట్రపతికి నివేదికలు సమర్పించారు.

‘మోదీ ఇంటి పేరు’ కేసులో రాహుల్ గాంధీ దోషి అని గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించడంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది. దీంతో ఆయన సోమవారం లోక్ సభకు హాజరయ్యారు. ఆయన 2019లో కేరళలోని వయనాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.


ఇదిలావుండగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఉదయం జరుగుతుంది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడతారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనడం గురించి చర్చ జరుగుతుంది. ఈ తీర్మానంపై మోదీ ఈ నెల 10న సమాధానం చెబుతారు. ఈ తీర్మానంపై లోక్ సభలో 20 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడతారు.

అయితే ఎన్డీయేకు దాదాపు 331 మంది ఎంపీల బలం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు విజయం సాధించే అవకాశం లేదు. మణిపూర్ సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడేలా చేయడంలో ప్రతిపక్షాలు సఫలమవుతాయి.


ఇవి కూడా చదవండి :

Minister Senthilbalaji: మంత్రి సెంథిల్‌బాలాజీకి చుక్కెదురు.. ఈడీ అరెస్టు సక్రమమేనంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ పాదయాత్రకు బ్రేక్‌

Updated Date - 2023-08-08T09:19:16+05:30 IST