Home » IAS
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్‌కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
Andhrapradesh: ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో భూవివాదాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ యాక్ట్‌పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో తాను బాధితుడినే అని పేర్కొన్నాడు.
Andhrapradesh: ఎన్నికల వేళ నిస్పక్షపాతంగా వ్యవహరించని అధికారుల పట్ల ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా మరో ఐఏఎస్ అధికారినిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. సీతమ్మపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాలకొండ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కల్పనా కుమారిని..
వైసీపీ దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైందని మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ అన్నారు. పట్టణంలోని సత్యం కన్వెన్షన హాల్లో శనివారం నిర్వహించిన టీడీపీ సీనియర్ కార్యకర్తలు, తటస్తుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
AP Elections 2024: రాష్ట్రంలో గాలి మారుతోందని అఖిల భారత సర్వీసు అధికారులు గ్రహించినట్లుగా కనబడుతోంది. అందుకే స్వరం సవరించుకుంటున్నారు. మారుతున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా పాత సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామాలు అధికారుల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పును సూచిస్తున్నాయి...
అమరావతి: రాయలసీమలో పోస్టింగ్ కోసం ఒక డీఐజీ అధికారితో చేసుకున్న ఒప్పందం ఐపీఎస్ వర్గాల్లో తాజాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తానంటూ ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు.
Telangana: రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏపీలో ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కొరడా ఝుళిపించింది. ముగ్గురు కలెక్టర్లపై సీఈసీ మంగళవారం నాడు వేటు వేసింది. కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా పై వేటు పడింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోపు బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. వీరి స్థానంలో వెంటనే ప్యానల్ పంపాలని కూడా ఆదేశించింది.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిలో ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు రాగా.. ఒకరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీగా శివలింగయ్య ఐఏఎస్ నియమితులయ్యారు.