Share News

AP News: ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తా..

ABN , Publish Date - Apr 04 , 2024 | 11:34 AM

అమరావతి: రాయలసీమలో పోస్టింగ్ కోసం ఒక డీఐజీ అధికారితో చేసుకున్న ఒప్పందం ఐపీఎస్ వర్గాల్లో తాజాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తానంటూ ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు.

AP News: ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తా..

అమరావతి: రాయలసీమలో పోస్టింగ్ (Posting) కోసం ఒక డీఐజీ (DIG) అధికారితో చేసుకున్న ఒప్పందం ఐపీఎస్ (IPS) వర్గాల్లో తాజాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో (Elections) మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తానంటూ ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఆ డీఐజీ తీరు నిర్ణయాలపై ఈసీ (Election Commission) ఆరా తీస్తోంది. ఒకటి.. రెండు రోజుల్లో ఆయనతో సహా ఆరుగురు అధికారులపై వేటు వేయవచ్చునని విశ్వాసనీయ సమాచారం. మరో అదనపు డీజీ (DG) స్థాయి అధికారి వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. ఇటీవల విశాఖ పోర్టు (Visakha Port)కు డ్రగ్స్ (Drugs) వచ్చిన సమాచారంతో సీబీఐ (CBI) రంగంలోకి దిగినప్పుడు వారి పనికి ఆటంకం కలిగించడం.. తాము శాంపిల్స్ తెస్తాం.. తీస్తామంటూ కొందరు అధికారులతో కలిసి పోర్టుకు వెళ్లడమే ఇప్పుడాయన కొంపముంచిందని అంటున్నారు. ఆయన బదిలీని ఆపడం అధికారపార్టీ నేతలవల్ల కాదని పోలీసు (Police) వర్గాలు అంటున్నాయి.

Updated Date - Apr 04 , 2024 | 11:38 AM