Home » INDIA Alliance
INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలకు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి.. పంజాబ్‌లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా.. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.
పండించే పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతుల చిరకాల డిమాండ్‌పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపిస్తే రైతులు పండించే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా ఒక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ న్యూఢిల్లీలో కాంగ్రెస్‌తో లోక్‌సభ సీట్ల పంపకాలపై తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఢిల్లీలో ఒక సీటుకు కూడా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని, అయినప్పటికీ కూటమి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌కు ఒక సీటు ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ కూటమి చాలా బలంగానే కనిపించింది. కొన్ని సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది కూడా! కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు(Parliament Elections 2024) ముందే విపక్ష ఇండియా కూటమికి(INDIA bloc) షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే బిహార్ సీఎం నితీశ్ కూటమికి గుడ్ బై చెప్పగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ఇండియా కూటమి వరుస షాక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. అస్సాం లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోటీకి ఏర్పడిన 'ఇండియా' కూటమి ఉనికిపై ఆధ్యాత్మిక గురువు, కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సందేహాలు వ్యక్తం చేశారు. కూటమి ఉనికి ప్రశార్థకం కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పుట్టుకతోనే అనేక రోగాల బారినపడిందని, అప్పట్నించీ వెంటిలేటర్‌పైనే ఉంటూ వచ్చందని అన్నారు.
'ఇండియా' కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఉద్దేశించినది మాత్రమేనని, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. 27 పార్టీలతో ఏర్పడిన 'ఇండియా' కూటమి పూర్తి మనుగడలో ఉందని, కలిసికట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు.
ఇండియా కూటమిలో(INDIA Alliance) లుకలుకలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. ఇటీవలే కూటమి కీలక నేత బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీఏ(NDA)తో జట్టుకట్టారు.
జీవితాంతం ఎన్డీఏ(NDA)లోనే కొనసాగుతానని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) అన్నారు. బీజేపీ(BJP)తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నితీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.