Home » INDIA Alliance
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు రాబోతోందా? ఎమ్మెల్యేలంతా పాట్నాకు రావాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించడం వెనకున్న కారణం ఏంటి? అంటే నితీష్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అవును.. నితీష్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారట. సీఎం పదవికి రాజీనామా చేసి.. అసెంబ్లీని కూడా రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేస్తారని జేడీయూ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.
పశ్చిమబెంగాల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమికి టీఎంసీ కీలక స్తంభమని, మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు ప్రకటించిన కొద్ది సేపటికే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వంతపాడింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో 'ఆప్' ఒంటిరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది.
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతుండగా, అదేరోజు విపక్ష పార్టీల నేతలు ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఎంచుకుంటున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండబోతున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా కూటమి' మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం అంత ఆషామాషీ వ్యహహారం కాదని ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ తేల్చేశారు. దీనికి సమయం పడుతుందని చెప్పారు.
ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ‘ప్రధాని అభ్యర్థి ఎవరు’ అనే ప్రశ్న హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పటికే కూటమిలోని ప్రధాన అభ్యర్థులు.. ఎన్నికలయ్యాకే ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చాలాసార్లు..
లోక్ సభ ఎన్నికలకు(Parliament Elections 2024) ముందు ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారని, కాంగ్రెస్ నేతలను పాపులుగా అభివర్ణిస్తూ అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sharma) వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ముంబై: ఇండియా కూటమి (I.N.D.I.A. bloc) కన్వీనర్ నియామకంపై కూటమి నేతల మధ్య ఎలాంటి వివాదం లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారంనాడు తెలిపారు. కూటమి ప్రధాని పేరు ప్రకటించి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లీడర్‌ను ఎన్నుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తీవ్రమైన చర్చోపచర్చల అనంతరం 'ఇండియా' బ్లాక్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎంపికయ్యారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అత్యున్నత పదవి కోసం పోటీదారుగా ఉన్న నితీష్ కుమార్ శనివారంనాడు జరిగిన కూటమి వర్చువల్ మీట్లో కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా ఈ పదవి అప్పగించాలని సూచించినట్టు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి కన్వీనర్‌గా వ్యవహరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరాకరించారు. ఈ పదవిని కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా అప్పగించాలని నితీష్ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఇండియా' కూటమి వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది.