Home » INDIA Alliance
ఓట్ల లెక్కింపు ముందు 150 జిల్లాల మేజిస్ట్రేట్లలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంతనాలు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి సైతం ఆయన తీసుకు వెళ్లారు.
'ఇండియా' కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అడిగినప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తమాషా సమాధానమిచ్చారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా ''295 ట్రాక్''ను ప్రస్తావించారు.
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఉత్కంఠభరిత వాతావరణం నడుమ 2024 లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగిసింది. ఓటర్ల మనోగతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆ సంఖ్య కూడా దాటవచ్చని, అంతకంటే మాత్రం తగ్గవని చెప్పారు.
సుదీర్ఘంగా సాగిన ఏడు దశల లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి ఘట్టం మరి కాసేపట్లో ముగియనుండటంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో 'ఇండియా' కూటమి నేతలు శనివారంనాడు సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడోవిడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఖర్గే మాట్లాడారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.
అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..