Share News

INDIA bloc meeting: కౌంటింగ్ స్ట్రాటజీపై 'ఇండియా' కూటమి సమీక్ష

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:29 PM

సుదీర్ఘంగా సాగిన ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ చివరి ఘట్టం మరి కాసేపట్లో ముగియనుండటంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో 'ఇండియా' కూటమి నేతలు శనివారంనాడు సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.

INDIA bloc meeting: కౌంటింగ్ స్ట్రాటజీపై 'ఇండియా' కూటమి సమీక్ష

న్యూఢిల్లీ: సుదీర్ఘంగా సాగిన ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ చివరి ఘట్టం మరి కాసేపట్లో ముగియనుండటంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి నేతలు శనివారంనాడు సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఇంతవరకూ జరిగి పోలింగ్ సరళి, ఫలితాలపై కూడా చర్చ జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఎం, డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) తదితర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, పీడీపీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

Assembly Elections Results: ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు


మల్లికార్జున్ ఖర్గేతో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశంలో పాల్గొన్నారు. శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేసాయ్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఛంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్, టీఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా, డి.రాజా, ముకేష్ సహాని తదితరులు హాజరయ్యారు.

For Latest News and National News click here

Updated Date - Jun 01 , 2024 | 05:29 PM