Share News

PM Modi: ధ్యానం చేస్తే జ్ఞానం రాదు.. ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్..

ABN , Publish Date - May 30 , 2024 | 04:34 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడోవిడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఖర్గే మాట్లాడారు.

PM Modi: ధ్యానం చేస్తే జ్ఞానం రాదు.. ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్..
Kharge and PM Modi

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడోవిడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఖర్గే మాట్లాడారు. మహాత్మాగాంధీ గురించి సినిమా చూసిన తర్వాత చాలామంది తెలుసుకున్నారని మోదీ (MODI) చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ప్రధానమంత్రి చదువుకుని ఉంటే ఇలాంటి మాటలు చెప్పువారుకాదన్నారు. ఆయన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గాంధీ గురించి ప్రధానికి తెలియకపోతే రాజ్యాంగం గురించి కూడా తెలియదని అన్నారు. జూన్ 4 తర్వాత మోదీకి ఖాళీ సమయం దొరికితే గాంధీ ఆత్మకథ, సత్యంతో నా అనుభవాలు పుస్తకాలను తప్పక చదవాలన్నారు.

Lok Sabha Elections 2024: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు


మోదీపై ఫైర్..

ప్రధాని మోదీ రాజకీయాలు ద్వేషంతో నిండిపోయాయని ఖర్గే విమర్శించారు. 18వ లోక్‌సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగుస్తుందని.. ఈ ఎన్నికలు చిరకాలం గుర్తుండిపోతాయని ఖర్గే పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు కుల, మతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఓట్లు వేశారన్నారు. మోదీ మాయమాటలను దేశ ప్రజలు నమ్మలేదన్నారు. జూన్4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుందని ఖర్గే తెలిపారు.


ధ్యానం చేస్తే జ్ఞానం రాదు..

కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయడానికి వెళ్లడంపై ఖర్గే ఘాటుగా స్పందించారు. వివేకానంద కేంద్రంలో ధ్యానం చేయడం వల్లనో, గంగలో స్నానం చేయడం వల్లనో విజ్ఞానం లభించదని,చదువుకోవడం ద్వారా జ్ఞానం లభిస్తుందన్నారు. గత 15 రోజుల్లో కాంగ్రెస్ పేరును 232 సార్లు, తన పేరును 758 సార్లు, ఇండియా కూటమి, ప్రతిపక్ష పార్టీల గురించి 573 సార్లు మాట్లాడిన మోదీ ఒక్కసారి కూడా ద్రవ్యోల్బణం పేరు ఎత్తలేదన్నారు.


నియంతృత్వం దిశగా..

కాంగ్రెస్ మేనిఫెస్టోను మతంతో ముడిపెట్టి బీజేపీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిందని ఖర్గే పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారన్నారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వం వైపు వెళుతోందని, ఈ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తుందని ఖర్గే విమర్శించారు.


Delhi: దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా.. గర్వంగా ఉందన్న కేజ్రీవాల్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For More National News and Telugu News..

Updated Date - May 30 , 2024 | 05:56 PM