Home » India tour of west indies2023
గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లను పలు రికార్డులను ఊరిస్తున్నాయి. రికార్డులు అందుకోనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు.
మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధానంగా వికెట్ కీపింగ్, స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరిని ఆడించాలనే విషయంలో మేనేజ్‌మెంట్‌కు సైతం తిప్పలు తప్పేలా లేవు. ఈ క్రమంలో మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే వన్డే సిరీస్ వచ్చేసంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 27, 29, ఆగష్టు 1వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు.
ఈ నెల 27 నుంచి భారత్‌తో వన్డే సిరీస్ (India vs West Indies Odi Series) ప్రారంభంకానున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ఎంపికచేసింది. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌పై వేటు వేశారు. కొంతకాలంగా పూరన్ ఫేలవ ఫామ్‌లో ఉన్నాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో (West Indies vs India 2nd Test) టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత(Team india) బౌలర్‌గా నిలిచాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగతంగా రెండో ఇన్నింగ్స్‌లో రెండెంకెల స్కోర్ చేరుకోవడం ద్వారా టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో రెండెంకెల స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(5/60) నిప్పులు కక్కే బంతులతో చెలరేగడంతో ఓవర్ నైట్ స్కోర్‌కు మరో 26 పరుగులు మాత్రమే జోడించి వెస్టిండీస్ ఆలౌటైంది. 229/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన విండీస్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు విలవిలలాడింది.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు అతిథ్య జట్టుతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో భారత యువ ఆటగాళ్లను శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ను మిస్ వరల్డ్ ట్రినిడాడ్ & టొబాగో ఆచే అబ్రహామ్స్ కలుసుకుంది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ను కలుసుకున్న ఆమె వారితో ప్రత్యేకంగా ముచ్చటించింది.
భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం ఆటంకిగా మారింది. మూడో రోజు ఆటలో మొదటి సెషన్ మధ్యలోనే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం ఆగుతుందేమో అని కాసేపు ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకపోయింది.