Home » IndiaVsEngland
ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వికెట్ల వెనకాల ఫోక్స్ క్రికెట్ స్పిరిట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించాడని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఒకే పేసర్ చాలు అనుకుంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకువాలని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే టీమిండియాకు సూచించాడు. అయితే జట్టుకు నాల్గో స్పిన్నర్ అవసరమా లేదా అనేది తనకు కచ్చితంగా తెలియదని చెప్పాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఊహించని విజయంతో ఇంగ్లండ్ జట్టు ఫుల్ జోష్‌లో ఉన్న వేళ ఆ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతిథ్య జట్టు భారత్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేస్తుందని హెచ్చరికలు జారీ చేశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ అధిక్యం లభించినప్పటికీ ఓటమి ఎదురుకావడం అభిమానులకు మింగుడుపడడం లేదు.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓడి నిరాశలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలున్నాయి.
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా ఏకంగా మూడు స్థానాలు దిగజారింది. రెండో స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగడానికి సరైన మంచి నీటి వసతి కల్పించకపోవడానికి తోడు టాయిలెట్స్‌ను కూడా శుభ్రంగా ఉంచలేదు.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.