IND vs ENG: హైదరాబాద్ టెస్టులో ఓటమి ఎఫెక్ట్.. ఏకంగా ఐదో స్థానానికి పడిపోయిన భారత్
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:19 AM
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా ఏకంగా మూడు స్థానాలు దిగజారింది. రెండో స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది.
హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా ఏకంగా మూడు స్థానాలు దిగజారింది. రెండో స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025 సైకిల్‌లో 5 మ్యాచ్‌లాడిన టీమిండియా రెండు గెలిచి, రెండు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో 43 శాతం విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 26 పాయింట్లున్నాయి. మొదటి టెస్ట్‌లో టీమిండియాను ఇంగ్లండ్ ఓడించినప్పటికీ ఎనిమిదో స్థానంలో ఉంది. 6 మ్యాచ్‌లాడిన ఇంగ్లీష్ జట్టు 3 విజయాలు, 2 అపజయాలు, ఒక మ్యాచ్ డ్రాతో ఉంది. 29 శాతం విజయాలతో ఇంగ్లండ్ ఖాతాలో 21 పాయింట్లు ఉన్నాయి. అయితే ఓవర్ రేట్ కారణంగా 19 పాయింట్లు నష్టపోవడం కూడా ఇంగ్లండ్‌కు మైనస్‌గా మారింది.
ఇక ఆదివారం రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని నమోదుచేసింది. అయినప్పటికీ ఆ జట్టు స్థానంలో ఎలాంటి మార్పు లేదు. ఏడో స్థానంలో కొనసాగుతోంది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా ఖాతాలో 6 విజయాలు, 3 పరాజయాలు, ఒక డ్రాతో 66 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు విజయాల శాతం 55గా ఉంది. ఇక రెండో స్థానంలో సౌతాఫ్రికా, మూడో స్థానంలో న్యూజిలాండ్, నాలుగో స్థానంలో బంగ్లాదేశ్, ఆరో స్థానంలో పాకిస్థాన్, తొమ్మిదో స్థానంలో శ్రీలంక జట్లు ఉన్నాయి. కాగా ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ ఓటమితో ఆరంభించింది. ఉప్పల్‌లో నాలుగో రోజైన ఆదివారమే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో నెగ్గింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ (7/62) భారత్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. ఆరంభంలోనే టాపార్డర్‌ను కుదురుకోనీయకుండా దెబ్బతీశాడు. చివర్లో టెయిలెండర్లు పోరాట పటిమ చూపినప్పటికీ కీలక సమయంలో వారిని సైతం పెవిలియన్‌కు చేర్చిన హార్ట్‌లీ ఇంగ్లండ్‌ను గెలిపించాడు. ఫలితంగా 231 రన్స్ ఛేదన కోసం బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ (39), భరత్ (28), అశ్విన్ (28), రాహుల్ (22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కాగా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 420 రన్స్ చేసింది. ఒల్లీ పోప్ (196) తృటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. హార్ట్‌లీ (34), రెహాన్ (28) రాణించారు. బుమ్రాకు 4, అశ్విన్‌కు 3, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246, భారత్ 436 పరుగులు చేశాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.