Home » IndiaVsEngland
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియాలోకి వచ్చే ఆటగాడు ఎవరనే చర్చ ఇంకా కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక బ్యాటరైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ముఖ్యంగా ఈ వార్త తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇంగ్లండ్ క్రికెట్ టీం హైదరాబాద్ వచ్చేసింది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఆదివారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు తర్వాత ఇంగ్లీష్ జట్టు నేరుగా హైదరాబాద్‌కు వచ్చింది.
Sachin Tendulkar: భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. రెండు జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. రెండు జట్ల మధ్య చివరగా జరిగిన టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగింది.
ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈనెల 25 నుంచి రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంట్లో భాగంగా శుక్రవారం జాతీయ సెలెక్టర్లు మొదట హైదరాబాద్, వైజాగ్ టెస్టుల కోసం 16 మందితో కూడిన పూర్తి స్థాయి బృందాన్ని ఎంపిక చేసింది.
IND-W vs ENG-W: ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత అమ్మాయిలు అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. ఇటు బ్యాటర్‌గా, అటు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
వరల్డ్‌కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద జట్లను చిన్న జట్టు చిత్తుగా ఓడిస్తున్నాయి. ఈ టోర్నీలో పసికూనలుగా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి.