Home » IndiaVsEngland
స్టార్ ఆటగాళ్లు వరుసగా జట్టుకు దూరమవుతున్న వేళ నిరాశలో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది.
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టీమిండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడంటూ ఇటీవల ప్రకటించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తాజాగా తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నాడు. తన యూట్యూబ్ చానెల్‌లో తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకే కాకుండా ప్రపంచ క్రికెట్ కూడా పెద్ద ఎదురుదెబ్బ అని మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. గత 15 ఏళ్లకు పైగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడని, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి అతను అర్హుడని చెప్పాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో సెంచరీతో అదరగొట్టిన గిల్ టీమిండియా భారీ ఆధిక్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. భారత్ విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొలేక ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా 67/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను టీమిండియా స్పిన్నర్లు వణికించారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు గాయమైంది. దీంతో అతను నాలుగో రోజు ఫీల్డింగ్ రాలేదు. ఈ విషయాన్ని నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Vizag test: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే మరో 332 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్ కష్టాల్లో జట్టును ఆదుకోవడమే కాకుండా అద్భుత సెంచరీతో దుమ్ములేపాడు.