Home » IndiaVsNewzealand
అవును నాలుగేళ్ల క్రితం మనం కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు బదులు తీర్చుకునే సమయం వచ్చేసింది. న్యూజిలాండ్‌ను దెబ్బకు దెబ్బకు తీసి ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందటి పీడ కలను చెరిపివేసి దాని స్థానంలో మరుపురాని విజయాన్ని పదిలంగా దాచుకోవడానికి సరైన సమయం ఇదే. 2019 జూలై 9. ఇప్పటికీ మన జట్టును పీడకలలా వెంటాడుతున్న తేదీ ఇది.
India vs New Zealand: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో కీలకమైన సెమీ ఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. బుధవారం భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీస్ పోరు జరగనుంది. సెమీస్‌లో గెలిచి ఫైనల్ చేరి ప్రపంచకప్ టోర్నీని నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్లేయింగ్ 11తో ఆడబోతుందనే ఆసక్తికరంగా మారింది.
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
India vs New Zealand: ఈ టోర్నీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ మాత్రం ఏకంగా 4 మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేటు బాగుండడానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో సెమీస్ బెర్త్ దక్కింది. టేబుల్‌పై ఉన్న బల బలాల ప్రకారం చూస్తే న్యూజిలాండ్‌ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాదు. అయినప్పటికీ అభిమానుల్లో కాస్త ఆందోళన ఉంది.
వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీస్ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అతిథ్య జట్టు టీమిండియా, గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. సెమీస్ పోరు కోసం ఐసీసీ, మ్యాచ్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాయి. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.
India vs New Zealand: ఆసక్తికరంగా సాగిన వన్డే ప్రపంచకప్ లీగ్ దశ పూర్తైంది. ప్రస్తుతం అందరి చూపు ఈ నెల 15, 16న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌ల పైనే ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఈ నెల 15న జరిగే మొదటి సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్.. 16న జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభంలో కాస్త బోర్ కొట్టించినప్పటికీ క్రమక్రమంగా ఊపందుకుంది. ఇటీవల పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లతోపాటు సంచలన విజయాలు కూడా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టు చిత్తుగా ఓడిపోతుంటే.. అఫ్ఘానిస్థాన్ వంటి చిన్న జట్లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైల్ స్టోన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరొక 93 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు వ్యక్తిగత మైల్ స్టోన్స్‌కు చేరువలో ఉన్నారు. మన ఆటగాళ్లు ఏకంగా 13 మైల్ స్టోన్స్‌కు దగ్గరలో ఉన్నారు.