Share News

World Cup: నాకౌట్ పోరు అంటే టీమిండియాకు ఆందోళన మాత్రమే.. న్యూజిలాండ్ అయితే వణికిపోతోంది.. ఎందుకో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-14T12:17:21+05:30 IST

India vs New Zealand: ఈ టోర్నీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ మాత్రం ఏకంగా 4 మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేటు బాగుండడానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో సెమీస్ బెర్త్ దక్కింది. టేబుల్‌పై ఉన్న బల బలాల ప్రకారం చూస్తే న్యూజిలాండ్‌ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాదు. అయినప్పటికీ అభిమానుల్లో కాస్త ఆందోళన ఉంది.

World Cup: నాకౌట్ పోరు అంటే టీమిండియాకు ఆందోళన మాత్రమే.. న్యూజిలాండ్ అయితే వణికిపోతోంది.. ఎందుకో తెలిస్తే..

ముంబై: మరికొద్ది గంటల్లో ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు ట్రోఫీ కోసం ఫైనల్‌లో అడుగుపెట్టనుండగా ఓడిన జట్టు ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ మాత్రం ఏకంగా 4 మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేటు బాగుండడానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో సెమీస్ బెర్త్ దక్కింది. టేబుల్‌పై ఉన్న బల బలాల ప్రకారం చూస్తే న్యూజిలాండ్‌ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాదు. అయినప్పటికీ అభిమానుల్లో కాస్త ఆందోళన ఉంది. కొంత కాలంగా ఐసీసీ ట్రోఫీల్లో కివీస్ చేతిలో మన జట్టు ఓడిపోతుండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా నాకౌట్ పోరులో కివీస్ చేతిలో టీమిండియాకు గతంలో వరుసగా పరాభవాలు ఎదురయ్యాయి.


2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. లీగ్ దశలో అన్ని బలమైన జట్లను ఓడిస్తున్న అంతంత మాత్రంగానే ఉండే కివీస్ చేతిలో ఓడిపోవడం టీమిండియాకు ఆందోళనగా మారింది. పైగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచకప్‌ సెమీస్‌లో మన రికార్డు ఏమి బాగాలేదు. చివరగా జరిగిన రెండు వన్డే ప్రపంచకప్ సెమీస్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. మొత్తంగా మన జట్టు 7 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లు ఆడితే గెలిచింది మూడు సార్లు మాత్రమే. టీ20 ప్రపంచకప్ నాకౌట్స్‌ల్లోనూ మన రికార్డు ఏమి బాగాలేదు. నాలుగు సార్లు సెమీస్ చేరితే రెండు సార్లు మాత్రమే గెలిచింది. మొత్తంగా రెండు ఫార్మాట్లలో కలిపి మన జట్టు 11 సార్లు సెమీస్ చేరితో 5 సార్లు మాత్రమే గెలిచింది. ఈ చెత్త రికార్డులను చూసి అభిమానులు కంగారుకు గురవుతున్నారు. దీంతో మన జట్టు సెమీస్ గండాన్ని దాడుతుందా? లేదా? అనే ఆందోళన చాలా మందిలో నెలకొంది.

అయితే టీమిండియా అభిమానులకు ఓ గుడ్ న్యూస్. సెమీస్ పోరుపై మనకు అంతగా ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ చరిత్రలో భారత్ కంటే న్యూజిలాండ్‌కే ప్రతి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. 5 దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ పోరులో కివీస్‌‌కు చెత్త రికార్డులు కాదు.. కాదు.. పరమ చెత్త రికార్డులున్నాయి. ఇప్పటివరకు న్యూజిలాండ్ ఏకంగా 8 సార్లు సెమీ ఫైనల్ చేరితే గెలిచింది రెండు సార్లు మాత్రమే. ఆ జట్టు సెమీస్ చేరడం ఇది 9వ సారి. మొదటి 6 సార్లు అయితే అసలు సెమీస్ గండాన్నే దాటనేలేదు. 2015, 2019లో మాత్రతే తుది అర్హత సాధించింది. కానీ అక్కడ మళ్లీ బోల్తాపడింది. దీంతో కనీసం ఒకసారి కూడా కప్ గెలవలేదు.

ఇక టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఆ జట్టు 5 సార్లు సెమీస్ చేరితే ఒకసారి మాత్రమే గెలిచింది. ఫైనల్‌కు అర్హత పొందిన ఆ ఒక్కసారి కూడా తుది పోరులో బోల్తాపడింది. మొత్తంగా వన్డే. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో న్యూజిలాండ్ జట్టు రికార్డు స్థాయిలో 13 సార్లు సెమీస్ చేరినప్పటికీ ఏకంగా 10 సార్లు ఓడిపోయింది. 1975, 1979, 1992, 1999, 2007, 2011 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ ఓడింది. 2015, 2019 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోయింది. 2007 నుంచి వరుసగా సెమీస్ చేరుతున్నప్పటికీ ట్రోఫీ మాత్రం కివీస్‌కు అందని ద్రాక్షలాగే మారిపోయింది. దీంతో గత చెత్త రికార్డులను పక్కనపెట్టి ఈ సారి అయినా కివీస్ కప్‌ను గెలుస్తోందో లేదంటే భారత్‌కు లొంగుతుందో చూడాలి. ట్రోఫీని అయితే ఇప్పటివరకు ఒకసారి కూడా గెలవలేదు కానీ ప్రపంచకప్ చరిత్రలో మంచి విజయవంతమైన జట్టుగా న్యూజిలాండ్ పేరు తెచ్చుకుంది. అయితే న్యూజిలాండ్‌కున్న ఈ చెత్త రికార్డులు భారత్‌కు కలిసొచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-11-14T12:17:27+05:30 IST