Share News

IND vs NZ: రోహిత్ నుంచి కోహ్లీ వరకు.. కుల్దీప్ నుంచి జడేజా వరకు.. 13 మైల్‌స్టోన్స్‌కు చేరువలో భారత ఆటగాళ్లు

ABN , First Publish Date - 2023-10-22T13:06:15+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు వ్యక్తిగత మైల్ స్టోన్స్‌కు చేరువలో ఉన్నారు. మన ఆటగాళ్లు ఏకంగా 13 మైల్ స్టోన్స్‌కు దగ్గరలో ఉన్నారు.

IND vs NZ: రోహిత్ నుంచి కోహ్లీ వరకు.. కుల్దీప్ నుంచి జడేజా వరకు.. 13 మైల్‌స్టోన్స్‌కు చేరువలో భారత ఆటగాళ్లు

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు వ్యక్తిగత మైల్ స్టోన్స్‌కు చేరువలో ఉన్నారు. మన ఆటగాళ్లు ఏకంగా 13 మైల్ స్టోన్స్‌కు దగ్గరలో ఉన్నారు. అయితే వీటన్నింటిని మన ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనే అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


14- ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 14 పరుగులు చేస్తే వన్డే ఫార్మాట్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా నిలుస్తాడు.

59- వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరో 59 పరుగులు చేస్తే వన్డే ఫార్మాట్లో 2,500 పరుగులను పూర్తి చేసుకుంటాడు.

1- వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరొక ఫోర్ బాదితే అన్ని ఫార్మాట్లలో కలిపి 700 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు.

93- కెప్టెన్ రోహిత్ శర్మ మరొక 93 పరుగులు చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.

111-ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 111 పరుగులు చేస్తే వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై వెయ్యి పరుగుల మైలు రాయిని చేరుకుంటాడు.

67- యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరొక 67 పరుగులు చేస్తే వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుంటాడు.

2- విరాట్ కోహ్లీ మరొక 2 క్యాచ్‌లు పడితే వన్డే పార్మాట్లో 150 క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా నిలుస్తాడు.

67- ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 67 పరుగులు చేస్తే వన్డేల్లో న్యూజిలాండ్ జట్టుపై 1,500 పరుగుల మైలు రాయిని చేరుకుంటాడు.

4- విరాట్ కోహ్లీ మరొక 4 సిక్సులు కొడితే వన్డే ఫార్మాట్లో 150 సిక్సులను పూర్తి చేసుకుంటాడు.

4- శ్రేయస్ అయ్యర్ మరో 4 సిక్సులు కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి

100 సిక్సులను పూర్తి చేసుకుంటాడు.

6- చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరొక 6 వికెట్లు తీస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి 250 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

8- రవీంద్ర జడేజా మరొక 8 ఫోర్లు కొడితే వన్డేల్లో 200 ఫోర్లను చేరుకుంటాడు.

102- శ్రేయస్ అయ్యర్ మరొక 102 పరుగులు చేస్తే వన్డేల్లో 2 వేల పరుగులను చేరుకుంటాడు.

Updated Date - 2023-10-22T13:06:15+05:30 IST