Home » International News
ఎన్నికల్లో పార్టీల అనుకూల-ప్రతికూల-తటస్థ అంశాలకు అనుగుణంగా అమెరికాలోని రాష్ట్రాలను మూడుగా విభజించారు. అవి.. రెడ్, బ్లూ, స్వింగ్ రాష్ట్రాలు. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తూవస్తున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు.
కెనడాలో ఖలిస్థానీలు మరోసారి హిందువుల ఆలయంపై దాడికి తెగబడ్డారు. టొరొంటోకు సమీపంలోని బ్రాంప్టన్ నగరంలో ఉన్న హిందూ సభ మందిరం వద్ద ఆదివారం విధ్వంసం సృష్టించారు.
ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి రాజకీయం చేస్తే.. అది అడ్డం తిరిగి మరో వర్గం మొత్తానికే దూరమై, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది మరోమారు రుజువు కాబోతోందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది!
యూనివర్శిటీలో నిరసన తెలిపిన యువతి ఆచూకీపై ఆమ్నేష్టి ఇంటర్నేషనల్ స్పందించింది. ఇరాన్ అధికారులు ఆ యువతని వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేసింది. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించకుండా అధికారులు నిరోధించాలని, తన కుటుంబ సభ్యులను, లాయర్‌ను కలుసుకునేందుకు ఆమెకు వీలు కల్పించాలని కోరింది.
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ స్వింగ్ రాష్ట్రాలు-- విస్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగాన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయినా ప్రభుత్వం సకాలంలో సాయం చేయలేదంటూ స్పెయిన్ దేశం రాజు ఫెలిపే-4పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా బీ-52 భారీ యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు తరలించింది. వీటితో పాటు ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా తరలించింది.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. ఆ కంపెనీలో తనకున్న వాటాలో 300 కోట్ల డాలర్ల (రూ.25,240 కోట్ల) విలువైన 1.6 కోట్ల షేర్లను తాజాగా విక్రయించారు.
అమెరికాకు చెందిన దిగ్గజ పెట్టుబడిదారు, వ్యాపారవేత్త వారెన్ బఫెట్ వద్ద ప్రస్తుతం ఏకంగా 32,500 కోట్ల డాలర్ల (రూ.27 లక్షల కోట్లు) నగదు ఉంది.
మహిళలు, మైనారిటీ వర్గాల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తోందని, కన్జర్వేటివ్ అమెరికన్లు ట్రంప్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈసారి నవంబర్ 5వ తేదీ మొదటి మంగళవారం జరుగుతోంది.