Share News

US Elections 2024: ట్రంప్-హ్యారిస్‌లో విజేత ఎవరు? అందరి చూపూ నవంబర్ 5 వైపే

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:21 PM

మహిళలు, మైనారిటీ వర్గాల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తోందని, కన్జర్వేటివ్ అమెరికన్లు ట్రంప్‌ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈసారి నవంబర్ 5వ తేదీ మొదటి మంగళవారం జరుగుతోంది.

US Elections 2024:  ట్రంప్-హ్యారిస్‌లో విజేత ఎవరు? అందరి చూపూ నవంబర్ 5 వైపే

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం తుది ఘట్టానికి చేరింది. నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ జరుగనుండటంతో ఇటు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజుల మాత్రమే సమయం ఉన్నందున రిపబ్లిన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థినిగా ఉన్న భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గెలుపునకు అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఫలితాల్లో కీలక పాత్ర పోషించే 7 స్వింగ్ స్టేస్ట్... అరిజోనా, జార్జియా, మిషగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్‌సిన్‌ రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారు. ట్రంప్ వ్యూహాత్మగాం చివరి ప్రచారంగా న్యూమెక్సికో, వర్జీనియాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మహిళలు, మైనారిటీ వర్గాల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తోందని, కన్జర్వేటివ్ అమెరికన్లు ట్రంప్‌ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈసారి నవంబర్ 5వ తేదీ మొదటి మంగళవారం జరుగుతోంది.

US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ట్రంప్-హ్యారిస్ ప్రధాన ప్రచారాస్త్రాలు

దేశంలో సరికొత్త ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తానని డోనాల్డ్ ట్రంప్ ప్రధాన వాగ్దానంగా ఉంది. కమలాహ్యారిస్ ఆర్థిక విధానాలు పూర్తిగా విఫలం చెందాయని, వేలాది ఉద్యోగాలు ఊడిపోయాయని చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని చెబుతున్నారు. నేరాలను అణిచివేస్తామని, ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ వ్యవస్థను నిర్మిస్తామని హామీలిస్తున్నారు. అక్రమ వలసలు అరికడతామని, పౌరుల మతపరమైన స్వేచ్ఛకు భంగం కలగనీయమని, దేశ చరిత్రను అవమానించే వారిని ఏడాది పాటు జైలుకు పంపుతామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ కంటే మెరుగైన దేశాధ్యక్షుడు ఈరోజు అమెరికాకు అవసరమని కమలా హ్యారిస్ గట్టి ప్రచారం సాగిస్తున్నారు. అమెరికా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే వారినే ఎన్నుకోవాలని, విద్వేషాలు రేకెత్చించే వారిని కాదని ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.


జనవరి 20న కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారం మధ్య సుదీర్ఘ వ్యవధి ఉంటుంది. ఇందుకు ఎలక్ట్రోరల్ కాలేజీ వ్యవస్థ ఉండటం ఒక కారణమైతే, ఫలితాలు వెలువడిన తర్వాత అధికార బదాలాయింపుకు కూడా కొంత సమయం పడుతుంది. కొత్త అధ్యక్షుడు, ఆయన టీమ్‌ ఏర్పాటుకు ఈ సమయం ఇస్తారు. జనవరి 6వ తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అధికారికంగా ప్రకటిస్తుంది. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.


Read More International News and Latest Telugu News

Updated Date - Nov 02 , 2024 | 05:21 PM