Home » IPL
Hardik pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ఐపీఎల్ 2024) ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ లీగ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. టోర్నీ కోసం నిర్వహించే వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు, విడిచి పెట్టిన ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. అందరూ ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యారీ బ్రూక్‌ను విడుదల చేసింది.
IPL 2024: 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. గత రెండు సీజన్లలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించగా.. అతడు వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కనిపించే అవకాశాలున్నాయి.
IPL 2024: ముంబై ఇండియన్స్ తాజాగా రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. వేలంలో రూ.17.5 కోట్లతో కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను రిలీజ్ చేసింది.
IPL 2024: వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు, బెట్టింగ్ రాయుళ్ల దృష్టి ఐపీఎల్ మీద పడింది. ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ వచ్చే సీజన్లో ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఐపీఎల్లో రాణించని పేసర్ అవేష్‌ఖాన్‌ను వదులుకోవాలని భావించింది. ఈ మేరకు ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ద్వారా తమ జట్టు ఆటగాడు అవేష్‌ఖాన్‌ను వదులుకుని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌ను తీసుకుంటున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోసూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం లక్నోకు మెంటార్‌గా ఉన్న గంభీర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే గౌతీ తన మాజీ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరనున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాదికి సంబంధించిన లీగ్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం నిర్వహించనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం ఈ సారి దుబాయ్‌లో జరిగే అవకాశాలున్నాయి. వేలానికి సంబంధించిన వేదిక విషయంలో దుబాయ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 2024 సీజన్ కూడా భారత్‌లోనే జరగనుందని సమాచారం. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ త్వరలోనే శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది.