Home » Islamabad
క్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) హింసతో అట్టుడుకిపోతోంది. భారీగా పెరిగిన ఆహార, విద్యుత్, నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
సూపర్ పవర్‌గా ఎదగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్థాన్ నిధుల కోసం అడుక్కుంటోందని విపక్ష నేత మౌలానా ఫజులుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు.
విమాన ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ప్రయాణికులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, అత్యవసర ద్వారాలను తెరవడం, విష సర్పాలు లోపలికి ప్రవేశించడం..
అఫ్ఘానిస్థాన్ శరణార్థులపై పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా దేశంలో నివసిస్తున్న వలసదారులు నవంబరు 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది...
వరదలు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలోకి జారుకుంటున్న ఆ దేశంలో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.14.91 పెరగింది, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.18.44 చొప్పున పెరిగింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారంనాడు నిలిపివేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ బెయిలుపై విడుదలయ్యేందుకు మార్గం సుగగమైంది.
పాకిస్థాన్ సైన్యాన్ని విమర్శించినందుకు మానవ హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది ఇమాన్ జైనబ్ మజరి-హజిర్ (26)ను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె తల్లి షిరీన్ మజరి 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. షిరీన్‌ను కూడా 2022 మే నెలలో అరెస్ట్ చేశారు.
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. అందులో భాగంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ‘జాతి ప్రయోజనాల’ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ నిట్టూర్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్‌ను ఏ క్షణంలోనైనా రద్దుచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇమ్రాన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, పీటీఐని రద్దు చేస్తే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని, రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఆ పార్టీ పేరుతోనే ఎదుర్కొని గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
రంగులు చల్లుకుంటూ కోలాహలంగా సందడి చేసే 'హోలీ' పండుగపై పాకిస్థాన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కన్నెర్ర చేసింది. యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఇస్లాం ఐడెంటిటీకి విరుద్ధమని ప్రకటించింది.