Imran Khan: దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం వచ్చినా..
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:35 PM
పాక్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన నిశ్చితాభిప్రాయమని ఇమ్రాన్ చెప్పారు. అయితే మానవ హక్కుల విషయాన్నికి వచ్చినప్పుడు సహజంగానే అంతర్జాతీయ సంస్థలు గళం విప్పుతాయని, ఈ లక్ష్యం కోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చెప్పారు.
ఇస్లామాబాద్: మూడేళ్ల పాటు దేశం విడిచి వెళ్లేందుకు తనకు అవకాశం వచ్చినప్పటికీ అంగీకరించ లేదని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ తాజా ట్వీట్‌లో తెలియజేశారు. 2023 నుంచి ఆయన రావల్పిండి అడియాలా జైలులో ఉన్నారు. జనవరి 2న ఆయన జైలు నుంచే మీడియా ప్రతినిధులతో సంభాషించారు.
Paetongtarn Shinawatra: ఆ ప్రధాని వద్ద 200 డిజైనర్ బ్యాగులు, 75 లగ్జరీ వాచ్‌లు
''నేను అటోక్ జైలులో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం వచ్చింది. అందుకు నిరాకరించాను. నేను ఇక్కడే బతుకుతాను. ఇక్కడే కన్నుమూస్తాను. అదే నా నిర్ణయం. ముందు నా సహచర నేతలు, కార్యకర్తలను విడిచిపెట్టాలి. అప్పుడే నా గురించి నేను ఆలోచిస్తాను'' అని ఇమ్రాన్ తెలిపారు.
పాక్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన నిశ్చితాభిప్రాయమని ఇమ్రాన్ చెప్పారు. అయితే మానవ హక్కుల విషయాన్నికి వచ్చినప్పుడు సహజంగానే అంతర్జాతీయ సంస్థలు గళం విప్పుతాయని, ఈ లక్ష్యం కోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమ్రాన్ విడుదలకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ట్రంప్ తటస్థంగానే ఉంటారని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. ముషరాఫ్ హయాంలోనూ మిలటరీ జోక్యం ఉందని తాము విమర్శించే వాళ్లమని, అయితే ఆ స్థాయిలో అణిచివేతలు మాత్రం లేవని షెహబాజ్ ప్రభుత్వంపై పరోక్షంగా ఇమ్రాన్ విమర్శలు చేశారు. ప్రభుత్వంతో పీటీఐ సంప్రదింపుల కమిటీ చర్చల పురోగతిపై మాట్లాడుతూ, తమ డిమాండ్లన్నీ చట్టబద్ధమైనవేనని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
New Virus: చైనాలో మళ్లీ కొత్త రకం వైరస్.. మరో మహమ్మారి రాబోతుందా..
International : 120 కమాండోలు.. 21 జెట్‌లు..3 గంటల్లోనే మిస్సైల్ ప్లాంట్ ధ్వంసం..
Read More International News and Latest Telugu News