Tahawwur Rana Extradition: తహవ్వుర్ రాణా కెనడా పౌరుడే.. పాక్ బుకాయింపు
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:40 PM
పాక్ ఆర్మీతో కానీ, ఐఎస్ఐఎస్‌తో కానీ రాణాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం బహిరంగ రహస్యమేనని, అయితే ముంబై దాడుల్లో పాక్ ప్రమేయం ఉందంటూ తమదేశంపై ఎలాంటి విష బీజాలు నాటుతాడోనని తాము భయపడుతున్నామని విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవ్వుర్ రాణా (Tahwwwur Rana)ను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువస్తుండటంపై పాకిస్థాన్ (Pakistan) తొలిసారి స్పందించింది. తహవ్వుర్ రాణాతో తమకెలాంటి సంబంధం లేదంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. రాణా గత రెండు దశాబ్దాలుగా పాకిస్థాన్ డాక్యుమెంట్లను పునరుద్ధరించుకోలేదని (renewed) తెలిపింది. ఆయన కెనడా జాతీయుడనే విషయం చాలా స్పష్టమని పేర్కొంది.
Tahawwur Rana: నేడు భారత్‌కు రాణా
పాక్ ఆర్మీతో కానీ, ఐఎస్ఐఎస్‌తో కానీ రాణాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం బహిరంగ రహస్యమేనని, అయితే ముంబై దాడుల్లో పాక్ ప్రమేయం ఉందంటూ తమదేశంపై ఎలాంటి విష బీజాలు నాటుతాడోనని తాము భయపడుతున్నామని విదేశాంగ శాఖ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, రాణా భారత్‌కు చేరుకోగాని తీహార్ జైలులోని హై-సెక్యూరిటీ వార్డుకు తరలించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వుల కోసం జైలు అధికారులు వేచిచూస్తున్నారు.
పాకిస్థాన్ ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసిన రాణా 1997లో కెనడాకు వలస వెళ్లాడు. అనంతరం అమెరికాకు వెళ్లి ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్‌లోని ఆ సంస్థ కార్యాలయంలోనే లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఆశ్రయం పొంది ముంబై పేలుళ్లకు కీలక భవనాల వద్ద రెక్కీ నిర్వహించినట్టు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.2008 నవంబరు 26న ముంబైపై జరిపిన ఉగ్రదాడిలో 174 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300 మందికిపైగా గాయాలపాలయ్యారు. రాణాను తమకు అప్పగించాలంటూ భారత్ చాలాకాలంగా అమెరికాను కోరుతోంది. ఎట్టకేలకు నేరస్థుల అప్పగింత కింద రాణాను భారత్‌కు అమెరికా అప్పగిస్తోంది.
ఇవి కూడా చదవండి..