Home » Israel
ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్(Israel)లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం భద్రతా సలహాను జారీ చేసింది. భారతీయ పౌరులందరూ(indian people) అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటాకాల్స్‌ను పాటించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఒక అడ్వయిజరీ జారీ చేసింది. మధ్యప్రాశ్చంలోని ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఇండియన్ ఎంబసీ ఈ అడ్వయిజరీ జారీ చేసింది.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.
హమాస్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్ రక్షణలో ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్ మిలిటరీ చీఫ్, ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మహమ్మద్ డెయిఫ్ హతమయ్యాడు.
హమాస్ నాయుకుడు ఇస్మాయిల్ హనియాను ఆయన బస చేసిన ప్రాంతంలో రాకెట్‌తో హత్య చేశారు. ఇది దుర్మార్గమైన యూదు ఉన్మాద హత్య అని హమాస్ చెబుతోంది. ఇంకా ఒప్పుకోలేదు కానీ ఇది ఇజ్రాయిల్ చేసిన హత్య అని తెలిసిపోతుంది.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. హనియా హత్యను ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. హనియాను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్, ఇరాన్ భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ కూడా విశ్వసిస్తున్నారు. ఆ క్రమంలో గురువారం రోజున ఇరాన్‌కు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా దాడి చేశారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఖతార్‌లో ఇస్మాయిల్ హనియా మంగళవారం పలు రాజకీయ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
హిజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫద్ షుక్రూను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. బీరట్‌లో ఉన్న ఫద్ షుక్రూను తమ వైమానిక దళ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని వివరించాయి. హిజ్బుల్లాకు ఫద్ షుక్రూ సీనియర్ కమాండర్, వ్యూహాత్మక విభాగం అధిపతిగా వ్యవహరించారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతం గోలన్ హైట్స్ వద్ద ఇటీవల రాకెట్ దాడి జరిగింది. ఆ దాడిలో 12 మంది చిన్నారులు చనిపోయారు.
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్‌ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో...
ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లో సాకర్ ఆడుతూ శనివారం హెజ్బొల్లా రాకెట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.