Share News

Air India: టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేత..!!

ABN , Publish Date - Aug 02 , 2024 | 02:12 PM

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.

Air India: టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేత..!!
Air India

ఢిల్లీ: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.


సర్వీసులు నిలిపివేత

ఇజ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్- ఢిల్లీ మధ్య ఎయిరిండియా విమాన సర్వీసులు నడుస్తాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విమానాలను రద్దు చేశామని ఎమిర్ ఇండియా ప్రకటన చేసింది. ‘పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటాం. ఆగస్ట్ 8వ తేదీ వరకు ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ మధ్య ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. టికెట్ల రద్దు, రీ షెడ్యూలింగ్‌పై ఒకసారి ఛార్జల మినహాయింపు ఇస్తాం. ప్రయాణికు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా సమాచారం కోసం 011-69329333, 011-69329999కి కాల్ చేయాలి అని’ ఎయిర్ ఇండియా యజమాన్యం కోరింది.


వారానికి 4 సర్వీసులు

ఢిల్లీ టెల్ అవీవ్ మధ్య వారానికి నాలుగు సర్వీసులను ఎయిర్ ఇండియా నడుపుతుంది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపిన తర్వాత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 5 నెలల పాటు టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను ఎయిర్ లైన్ నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి తాత్కాలికంగా నిలిపివేసింది. సిచుయేషన్ బట్టి విమాన సర్వసును ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా, లెబనాన్‌లో హిజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్రుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. వరసగా ఇద్దరు అగ్ర నేతలపై ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. దాంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదని పాలస్తీనా, హమాస్, ఇరాన్ స్పష్టం చేసింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో విమాన రాకపోకలను నిలిపివేస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటన చేసింది.

Updated Date - Aug 02 , 2024 | 02:12 PM